UPSC Mains 2021: వాయిదా ప్రసక్తేలేదు.. షెడ్యూల్ ప్రకారమే యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు..
UPSC Mains 2021 Exams: దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తోపాటు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో అంతటా ఆందోళన
UPSC Mains 2021 Exams: దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తోపాటు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో అంతటా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పలు పోటీ పరీక్షలు కూడా జరగాల్సి ఉంది. దీంతో కోవిడ్ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ మేరకు పరీక్ష వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరగా.. దానిని హైకోర్టు అనుమతించలేదు. కరోనా నిబంధనలతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది. కంటైన్మెంట్, మైక్రో కంటైన్మెంట్ జోన్ల నుంచి వచ్చే వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకకుండా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Delhi High Court dismisses plea of several candidates seeking direction to postpone the schedule of Civil Services (Mains) Examination 2021 till the COVID-19 situation normalises.
— ANI (@ANI) January 6, 2022
జనవరి 7,8,9,15,16 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారమే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం స్పష్టంచేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అధికారులు మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా.. గతేడాది అక్టోబర్ నెలలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ జరిగిన సంగతి తెలిసిందే. జూన్ నెలలో జరగాల్సిన పరీక్షలను కరోనా కారణంగా అక్టోబర్‌కు వాయిదా వేశారు. అక్టోబర్‌లో పరీక్షలను నిర్వహిలంచిన యూపీఎస్సీ వెంటనే ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
Also Read: