CSIR UGC NET అభ్యర్థులకు గమనిక.. కరెక్షన్ విండో ఓపెన్ చేసిన NTA.. జనవరి 9న మార్పులకు అవకాశం..

CSIR UGC NET 2022: CSIR UGC NET జూన్ 2021కి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

CSIR UGC NET అభ్యర్థులకు గమనిక.. కరెక్షన్ విండో ఓపెన్ చేసిన NTA.. జనవరి 9న మార్పులకు అవకాశం..
Csir Ugc Net
Follow us

|

Updated on: Jan 06, 2022 | 11:44 AM

CSIR UGC NET 2022: CSIR UGC NET జూన్ 2021కి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.inని సందర్శించి తప్పులు సరిదిద్దుకోవచ్చు. అభ్యర్థులందరికి జనవరి 9, 2022న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11:50 గంటల వరకు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. NTA జారీ చేసిన నోటీసు ప్రకారం.. జనవరి 9, 11:50 pm తర్వాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు. NTA ఇచ్చిన సమయంలో మార్పులు చేసిన తర్వాత అభ్యర్థులు ఏవైనా అదనపు ఛార్జీలు (వర్తిస్తే) చెల్లించాల్సి వస్తే క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI లేదా Paytm వాలెట్ ద్వారా చెల్లించవచ్చు.

జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 6 తేదీల్లో పరీక్ష ఈ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి జనవరి 8, 2021న లేదా అంతకు ముందు ఫీజు చెల్లించిన అభ్యర్థులకు మాత్రమే అడ్మిట్‌ కార్డు వస్తుంది. జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 6, 2022న NTA పరీక్ష జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఐదు సబ్జెక్టులపై అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు లోబడి భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), లెక్చర్‌షిప్ (LS)/అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు అర్హత ప్రమాణాలను నిర్ణయించడానికి CSIR UGC NET నిర్వహిస్తారు.

Expensive Hotel: ప్రపంచంలో ఇలాంటి హోటల్స్ కూడా ఉంటాయా..! ఒక్కరాత్రికి బస చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..

LIC: ఎల్‌ఐసీ పాలసీదారులకు గమనిక.. కొత్త ప్లాన్ వచ్చేస్తోంది.. మెచ్యురిటీలో ఎక్కువ డబ్బు..

3 బంతులు ఆడిన తర్వాత వెళ్లిపోమన్నారు.. నువ్వు పనికిరావన్నారు.. కానీ ఇండియన్ కెప్టెన్‌గా 3 వరల్డ్‌ కప్‌లకి నాయకత్వం వహించాడు..?