ప్రపంచంలో ఇలాంటి హోటల్స్ కూడా ఉంటాయా..! ఒక్కరాత్రికి బస చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..

ప్రపంచంలో ఇలాంటి హోటల్స్ కూడా ఉంటాయా..! ఒక్కరాత్రికి బస చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
Expensive Hotel

Expensive Hotel: కొంతమంది ఖరీదైన హోటళ్లలో బస చేయడానికి ఇష్టపడుతారు. దీని కోసం వారు రోజుకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. 5 నుంచి 10 వేల వరకు ఖర్చు చేస్తారు.

uppula Raju

|

Jan 06, 2022 | 11:17 AM

Expensive Hotel: కొంతమంది ఖరీదైన హోటళ్లలో బస చేయడానికి ఇష్టపడుతారు. దీని కోసం వారు రోజుకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. 5 నుంచి 10 వేల వరకు ఖర్చు చేస్తారు. కానీ ఒక హోటల్‌లో ఒక్క రాత్రి బస చేయాలంటే లక్షల రూపాయలు కావాలి. అవును మీరు విన్నది నిజమే. ఒక రోజు బస చేయాలంటే 50 లక్షల రూపాయలకు పైగా కావాలి. ఇదే ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్‌. ఇది కాకుండా భారతదేశంలో అత్యంత ఖరీదైన హోటల్ ఎక్కడుంది. ఒక్కరోజుకి ఎంత చెల్లించాలి. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్ ఏది? ప్రపంచంలో అత్యంత ఖరీదైన హోటల్ గురించి మాట్లాడినట్లయితే అది The Empathy Suite, Palms Casino Resort. ఇది అమెరికాలోని లాస్ వేగాస్‌లో ఉంది. ఇక్కడ ఒక రోజు బస చేస్తే ధర సుమారు 1 లక్ష డాలర్లు. భారతీయ కరెన్సీని పరిశీలిస్తే 70 లక్షల రూపాయలకు పైమాటే. అంటే ఇక్కడ ఒక్కరోజు ఉండాలంటే 70 లక్షల రూపాయలు వెచ్చించాల్సిందే.

ఇక్కడ అతిథి 24 గంటలపాటు క్యాసినో సదుపాయాన్ని పొందుతాడు. దాని ప్రత్యేక ఆకృతి ప్రజలను దాని వైపు ఆకర్షిస్తుంది. దీనిని ప్రసిద్ధ బ్రిటిష్ కళాకారుడు రూపొందించారు. ఇందులో మాస్టర్ బెడ్‌రూమ్, మసాజ్ టేబుల్, రిలాక్సేషన్ రూమ్, జాకుజీ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దీని కారణంగా ఈ హోటల్ ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఇందులో ఉండటానికి చాలా డబ్బు ఖర్చు చేస్తారు.

భారతదేశంలో అత్యంత ఖరీదైన హోటల్ ఎక్కడ ఉంది భారతదేశంలో అత్యంత ఖరీదైన హోటల్ గురించి మాట్లాడినట్లయితే జైపూర్‌లో ఉంది. దాని పేరు రాంబాగ్ ప్యాలెస్. ఇందులో ఒక ప్రత్యేక గది ఉంది. ఇందులో బస చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. ఈ హోటల్‌లో అనేక రకాల గదులు అందుబాటులో ఉన్నాయి. హోటల్‌లో సుఖ్ నివాస్ అనే ప్రత్యేక గది ఉంది. ఈ గది చాలా చర్చనీయాంశమైంది. ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన హోటల్ గదులలో ఒకటి అని నమ్ముతారు. దీనిలో బస చేయడానికి రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేయాలి.

ఈ గది రాజ శైలికి ప్రసిద్ధి చెందింది. ఇందులో రాయల్ డైనింగ్ రూమ్, డ్రెస్సింగ్ ఏరియాతో కూడిన మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటాయి. ఈ గదిలో మీరు ఒక మహారాజు అనుభూతిని పొందుతారు. చాలా మంది ప్రముఖులు ఇందులో ఉండడానికి ఇష్టపడతారు. ఛార్జీల గురించి మాట్లాడినట్లయితే అది సమయాన్ని బట్టి మారుతుంది. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. దీని ఒక రోజు అద్దె దాదాపు రెండున్నర లక్షల రూపాయలు. అయితే కొన్నిసార్లు దీని కోసం ప్రజలు 10 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

LIC: ఎల్‌ఐసీ పాలసీదారులకు గమనిక.. కొత్త ప్లాన్ వచ్చేస్తోంది.. మెచ్యురిటీలో ఎక్కువ డబ్బు..

3 బంతులు ఆడిన తర్వాత వెళ్లిపోమన్నారు.. నువ్వు పనికిరావన్నారు.. కానీ ఇండియన్ కెప్టెన్‌గా 3 వరల్డ్‌ కప్‌లకి నాయకత్వం వహించాడు..?

ర్చి6న NEET MDS పరీక్ష.. సిలబస్‌, పేపర్ నమూనా గురించి తెలుసుకోండి..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu