Crime News: నిశ్చితార్థం జరిగిన బాలికపై లైంగిక దాడి, ఆపై రాళ్లతో కొట్టి దారుణ హత్య!

Crime News:  నిశ్చితార్థం జరిగిన బాలికపై లైంగిక దాడి, ఆపై రాళ్లతో కొట్టి దారుణ హత్య!

రాజస్థాన్‌లో దారుణం వెలుగుచూసింది. దుంగార్‌పూర్ జిల్లాలోని సంగ్వారా ప్రాంతంలో సోమవారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న 18 ఏళ్ల యువతి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు.

Balaraju Goud

|

Jan 06, 2022 | 5:36 PM

Rajasthan Mad lover killed Girl: రాజస్థాన్‌లో దారుణం వెలుగుచూసింది. దుంగార్‌పూర్ జిల్లాలోని సంగ్వారా ప్రాంతంలో సోమవారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న 18 ఏళ్ల యువతి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. యువతిపై మొదట అత్యాచారం చేసి, ఆపై రాయితో తలపై పొడిచి చెట్టుకు ఉరివేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. చనిపోయిన యువతికి నిశ్చితార్థం జరిగిందని తెలుసుకున్న ఓ ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యువతిని ఏకపక్షంగా ప్రేమించిన నేరస్థుడు ముఖేష్ నానోమా.. లైంగిక దాడికి పాల్పడి, హత్య చేశాడు. యువతిని చంపే ముందు ‘నువ్వు నాదానివి కాకపోతే ఇంకెవర్వితో ఉండనివ్వను’ అంటూ దారుణానికి పాల్పడట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దుంగార్‌పూర్ జిల్లాలోని సంగ్వారా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతికి కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె తన కాబోయే భర్తతో ఫోన్‌లో మాట్లాడేది. అయితే ఆ యువతి‌ని వన్ సైడ్ లవ్ చేసిన ముఖేష్ నానోమా అనే వ్యక్తి దీనిని జీర్ణించుకోలేకపోయాడు. తనకు దక్కనిది మరోకరికి దక్కకూడదని యువతిపై కోపం పెంచుకున్నాడు. ఆమెను హత్య చేసేందుకు పక్కాగా ఫ్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే మొదట యువతిపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత తలపై రాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం చెట్టకు ఉరివేశాడు.

ఈ ఘటనపై ఎస్పీ సుధీర్ జోషి మాట్లాడుతూ.. ‘ యువతి తలకు గాయం కావడం వల్లే హత్య జరిగినట్టుగా తెలిసింది. పోలీసు బృందం 20 గంటల్లో నిందితుడిని పట్టుకుంది. బాధిత యువతిని చాలా కాలంగా ప్రేమిస్తున్నట్లు నిందితుడు విచారణలో తెలిపాడు. యువతి నిశ్చితార్థం జరగడం తెలిసి నిందితుడు కోపం పెంచుకున్నాడు. యువతిని బావిలోకి తోసి చంపేయాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే ఇంటికి పిలిచి కొంత దూరంలో ఉన్న పొలానికి తీసుకెళ్లాడు. అయితే, యువతి బావి దగ్గరికి వెళ్లలేదు. దీంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అనంతరం యువతిపై అత్యాచారం చేసి రాయితో తలపై కొట్టాడు. ఆ తర్వాత మఫ్లర్‌తో చెట్టుకు వేలాడదీశాడు. చెట్టుకు ఉరి వేసిన తర్వాత యువతి ప్రాణాలతో ఉందో లేదో తెలసుకోవడానికి రాళ్లు విసిరినట్టుగా నిందితుడు చెప్పాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత మాత్రమే అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాడు’ అని ఎస్పీ తెలిపారు.

ఇక, బాధిత బాలిక కూలి పని చేసేదని చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం కూలీగా వచ్చి తమ్ముడికి భోజనం వండి పెట్టింది. బాలిక అన్నయ్య బైక్‌పై వేరే గ్రామానికి వెళ్లాడు. అన్నయ్య, తల్లి వచ్చి చూడగా బాలిక కనపించలేదు. అయితే మరుసటి రోజు యువతి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లుగా వారికి సమాచారం అందింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు.

Read Also….  అలాంటి మహిళలను గుర్తించి అరెస్ట్ చేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu