అలాంటి మహిళలను గుర్తించి అరెస్ట్ చేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు

అలాంటి మహిళలను గుర్తించి అరెస్ట్ చేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు
Perarasu

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు పాపులర్ అవుతున్నారో తెలియడంలేదు. ఏ చిన్న వెర్రివేషాలు.. పిచ్చి చేష్టలు చేసి వీడియోలు

Rajeev Rayala

|

Jan 06, 2022 | 5:17 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు పాపులర్ అవుతున్నారో తెలియడంలేదు. ఏ చిన్న వెర్రివేషాలు.. పిచ్చి చేష్టలు చేసి వీడియోలు పెట్టిన క్షణాల్లో లక్షల లైకులు.. వేలల్లో కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఇక టిక్ టాక్ ఉన్న సమయంలో జనల పిచ్చి పీక్స్‌కు చేరింది. అల్లరి చిల్లరి వీడియోలతోపాటు అసభ్యకర వీడియోలను కూడా చేస్తూ నానా రచ్చ చేశారు కొందరు. ఇష్టమొచ్చినట్టు.. పిచ్చి పిచ్చి డ్యాన్స్ లు చేస్తూ వీడియోలు తీసి పోస్ట్ చేశారు కొందరు. ఇక టిక్ టాక్ యాప్‌ను ఇండియాలో బ్యాన్ చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ… ఆ యాప్‌ కారణంగా సమాజం నష్టపోయిన తీరును.. ఇంకా కొంతమంది గుర్తుకు తెస్తూనే ఉన్నారు. వేదికల మీద నుంచి అడపాదడపా మాట్లాడుతూనే ఉన్నారు.

అలా తాజాగా కోలీవుడ్ డైరెక్టర్‌ పేరరసు కూడా టిక్ టాక్‌ యాప్‌ ద్వారా అశ్లీల, అసభ్యకర వీడియోలు వైరల్ అయిన తీరును మరో సారి గుర్తు చేశారు.గుర్తు చేయడమే కాదు.. అలాంటి వీడియోలతో టిక్ టాక్లో పాపులర్ అవుదామని చూస్తున్న మహిళలను గుర్తించి అరెస్టు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొల్లాచ్చి ఘటన కేసు ఏమైందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. టిక్ టిక్ లో అరాచకాలు చేసిన మహిళలతో పాటు.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా నడుచుకునే ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే ఈ మాటలను ఆయన ఓ సినిమా ఈవెంట్‌లో చేయడంతో ప్రస్తుతం పేరరసు చేసిన వ్యాఖ్యాలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారాయి. మరోసారి అశ్లీల యాప్స్ పై అందరూ విరుచుకుపడేలా చేశాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Siri-Srihan: ఇన్‏స్టాలో సిరి ఫోటోలను డిలీట్ చేసిన శ్రీహాన్.. బ్రేకప్ దిశగా లవ్ బర్డ్స్ ?..

పీఎం మోడీకి భద్రత కల్పించకపోవడంపై మండిపడిన కంగనా.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ విమర్శలు

Acharya: ఆచార్య స్పెషల్ సాంగ్ పై వివాదం.. ఆ లిరిక్ తమ మనోభావలను దెబ్బతీసిందంటూ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu