DJ Tillu: టిల్లు అన్న డీజే పెడితే ఇలాగే ఉంటది.. అదరగొడుతోన్న డీజే టిల్లు టైటిల్‌ సాంగ్‌..

యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ' డీజే టిల్లు'. 'అట్లుంటది మనతోనే' అనేది సినిమా ఉపశీర్షిక. నేహా శెట్టి ఈచిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం

DJ Tillu: టిల్లు అన్న డీజే పెడితే ఇలాగే ఉంటది.. అదరగొడుతోన్న డీజే టిల్లు టైటిల్‌ సాంగ్‌..
Dj Tillu
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2022 | 5:27 PM

యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘ డీజే టిల్లు’. ‘అట్లుంటది మనతోని’ అనేది సినిమా ఉపశీర్షిక. నేహా శెట్టి ఈచిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేశారు. తాజాగా టైటిల్ గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. ‘లాలాగూడ..అంబర్‌ పేట.. మల్లేపల్లి..మలక్‌ పేట..టిల్లు అన్నా డీజే పెడితే ‘ అంటూ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను వివరిస్తూ సాగుతోందీ పాట. ఈ సాంగ్‌కు కాసర్ల ర్యామ్‌కు సాహిత్యం అందించగా రామ్‌ మిర్యాల ఆలపించారు. శ్రీచరణ్‌ పాకాల స్వరాలు సమకూర్చారు.

రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘గుంటూరు టాకీస్‌’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ. ఆతర్వాత ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’, ‘మా వింత గాథ వినుమా’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు ‘డీజే టిల్లు’తో హీరోగా మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు మన ముందుకు వస్తున్నాడు. ఇక హీరోయిన్‌ విషయానికొస్తే.. కర్ణాటకకు చెందిన నేహాశెట్టి గతంలో ఆకాశ్‌ పూరీతో కలిసి ‘మెహబూబా’ చిత్రంలో నటించింది. ఆతర్వాత సందీప్‌ కిషన్‌తో కలిసి ‘గల్లీ రౌడీ’లో సందడి చేసింది. అయితే ఈ రెండు సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు ఇవ్వలేకపోయాయి.

Also Read:

Coronavirus: కరోనా టెర్రర్.. ఫ్లైట్ లో ప్రయాణించిన 170 మందిలో125 మందికి పాజిటివ్‌..! ఎయిర్ ఇండియా క్లారిటీ

Viral video: అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో..

Coronavirus: సినిమా ఇండస్ట్రీలో కరోనా టెన్షన్‌.. వైరస్‌ బారిన మరో కోలీవుడ్‌ హీరో..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ