Rahul Sankrityayan: టైమ్ ట్రావెల్ నేపథ్యంలో కథను సిద్ధం చేస్తున్న శ్యామ్ సింగరాయ్ దర్శకుడు..
టాక్సీ వాలా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాహుల్ సాంకృత్యన్. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Rahul Sankrityayan: టాక్సీ వాలా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాహుల్ సాంకృత్యన్. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విభిన్న కథాంశం తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత రీసెంట్ గా నాని తో శ్యామ్ సింగరాయ్ సినిమా చేశారు రాహుల్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను కూడా రాహుల్ వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కించాడు. ఈ సినిమా అటు నానికి ఇటు సాయి పల్లవి కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. కలకత్తా నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పై విమర్శకుల ప్రసంశలు అందుకుంది. దాంతో ఇప్పుడు రాహుల్ తో సినిమా చేయడానికి పెద్దహీరోల కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
తాజాగా రాహుల్ ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. నేను ఈ కథను ముందుగా సితార బ్యానర్ వారికి వినిపించాను. నాని హీరోగా ఈ సినిమా చేయడానికి వారు అంగీకరించారు. ఆతర్వాత వాళ్ళు వెనకడుగేశారు. నాని గారు పిలిచి ప్రొడక్షన్ హౌస్ మారుతుంది.. మిగతా టీమ్ అంతా అదే ఉంటుంది. ప్లానింగ్ మార్చుకోవలసిన అవసరం లేదు అని చెప్పారు అని రాహుల్ తెలిపాడు. ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ వెంకట్ బోయనపల్లి చేతికి వెళ్ళింది. ఈ కథ 70 దశకానికి సంబంధించినది కావడం. నాకు ఎంతో ఇష్టమైన బెంగాల్ నేపథ్యంలో సాగడం. ఒక రైటర్ ను హీరోగా చూపించాలనే కోరిక నాలో బలంగా ఉండటం. అందువల్లనే ఈ సినిమాను నేను ఒక తపస్సుగా భావించి పూర్తి చేశాను అన్నాడు రాహుల్. ఇక ఇప్పుడు టైమ్ ట్రావెల్ నేపథ్యంలో కథను సిద్ధం చేస్తున్నా.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆతర్వాత ఎవరితో చేయాలనేది ఆలోచిస్తా.. అని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :