Siri-Srihan: ఇన్‏స్టాలో సిరి ఫోటోలను డిలీట్ చేసిన శ్రీహాన్.. బ్రేకప్ దిశగా లవ్ బర్డ్స్ ?..

Siri-Srihan: ఇన్‏స్టాలో సిరి ఫోటోలను డిలీట్ చేసిన శ్రీహాన్.. బ్రేకప్ దిశగా లవ్ బర్డ్స్ ?..
Siri

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశాల నుంచి మనవరకు వచ్చిన ఈ షోకు

Rajitha Chanti

|

Jan 06, 2022 | 1:58 PM

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశాల నుంచి మనవరకు వచ్చిన ఈ షోకు రోజు రోజుకీ మరింత ఆదరణ పెరిగిపోతుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఒక్కటేమిటి అన్ని భాషల్లోనూ సీజన్స్ ప్రకారం దూసుకుపోతుంది. ఇటీవల తెలుగులోనూ సీజన్ 5 విజయవంతంగా ముగిసింది. బిగ్‏బాస్ షో వలన లాభాలున్నాయి.. అంతకంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. అస్సలు పాపులారిటీ లేనివారిని సెలబ్రెటీగా మారుస్తుంది.. క్రేజ్ ఉన్నవారి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది. అలా బిగ్‏బాస్ ద్వారా తమ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు.

అయితే ఇప్పుడు ఈ షో.. బంధాల మధ్య చిచ్చురేపింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బిగ్‏బాస్ పుణ్యమా అని ఓ జంట తమ ఐదు సంవత్సరాల ప్రేమకు బ్రేకప్ చెప్పుకోగా.. ఇప్పుడు మరో జంట కూడా విడిపోయే పరిస్థితికి చేరుకుంది. బిగ్‏బాస్ సీజన్ 5లో అందరికంటే ఎక్కువగా నెగిటివిటిని మూటగట్టుకున్నారు షణ్ముఖ్, సిరి. బిగ్‏బాస్ షోకు వెళ్లకముందు షన్నూ.. యూట్యూబ్ స్టార్. మిలియన్స్ ఫాలోవర్స్‏తో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే కెరీర్ సెట్ అవుతుంది అనుకున్న సమయంలో బిగ్‏బాస్ షోలో తన ప్రవర్తన కారణంగా తనకు తానే నెగిటివిటిని మూటగట్టుకున్నాడు. ప్రతిసారీ హౌస్‌లో సిరి, షణ్ముఖ్ హగ్గులు, ముద్దులు ప్రేక్షకులకు రోత పుట్టించాయి. సిరితో స్నేహం చేయడం ద్వారా తను రన్నరప్ కావాల్సి వచ్చిందని షో ముగిసిన షణ్ముఖ్ చేసిన కామెంట్స్ అతడిపై ప్రేక్షకుల్లో నెగిటివిటీని మరింత పెంచాయి. దీంతో తనకు వెన్నంటే ఉండి ముందు నుంచి సపోర్ట్ చేసిన ప్రియురాలు దీప్తి.. బిగ్‏బాస్ ముగిసిన తర్వాత వీరి ప్రేమ బంధానికి స్వస్తి పలికింది. న్యూఇయర్‌కు ఒక్క రోజు ముందు సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేసి తన బాధను వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. మరోవైపు షణ్ముఖ్‏తో పాటు సిరిపై కూడా నెగిటివిటి పెరిగిపోయింది. బిగ్‏బాస్ హౌస్ లో ఉన్నప్పుడే కాదు.. ఇప్పటికీ సిరిపై ట్రోలింగ్స్ మాత్రం ఆగడం లేదు. బిగ్‏బాస్ షోకు వెళ్లకముందే సిరి.. తన ప్రియుడు శ్రీహాన్‏తో ఎంగెజ్మెంట్ చేసుకుంది. కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత షన్నూతో స్నేహం.. హగ్గులతో తన ఇమేజ్ పూర్తిగా తగ్గించుకుంది. తన తల్లి వచ్చి నచ్చలేదని చెప్పినా వినకపోవడం.. ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్గు అని చెప్పడం.. ప్రేక్షకుల్లో సిరి ఇమేజ్‏ను తగ్గించేశాయి.

మరోవైపు సిరి, శ్రీహాన్ లు.. త్వరలోనే బ్రేకప్ చెప్పుకోబోతున్నారంటూ నెట్టింట్లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సిరి పుట్టిన రోజు వేళ తన సోషల్ మీడియా ఖాతాలో ఆమెకు పుట్టిన రోజు విషెస్ చెప్పాడు శ్రీహాన్. కానీ ఇందుకు సిరి నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీంతో వీరిద్దరి నిజంగానే విడిపోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ఈ రూమర్స్ కు బలం చేకూరేలా తాజాగా శ్రీహాన్ తన ఇన్‏స్టా ఖాతా నుంచి సిరి ఫోటోస్.. డెలిట్ చేసేశాడని టాక్. కేవలం ఇద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్‏లకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఉన్నాయి. దీంతో శ్రీహాన్, సిరి మధ్య బ్రేకప్ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Naa Peru Shiva 2: మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్న కార్తీ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు” నాపేరు శివ 2″

Gali Janardhan Reddy Son: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి​ కొడుకు.. దర్శకుడు ఎవరంటే..

Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu