AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: సినిమా ఇండస్ట్రీలో కరోనా టెన్షన్‌.. వైరస్‌ బారిన మరో కోలీవుడ్‌ హీరో..

దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. థర్డ్‌వేవ్‌ ఆందోళనలు నిజం చేస్తూ రోజూ వేలాదిమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఈ వైరస్‌ బాధితుల జాబితాలో చేరుతున్నారు.

Coronavirus: సినిమా  ఇండస్ట్రీలో కరోనా టెన్షన్‌.. వైరస్‌ బారిన మరో కోలీవుడ్‌ హీరో..
Arun Vijay
Basha Shek
|

Updated on: Jan 06, 2022 | 3:48 PM

Share

దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. థర్డ్‌వేవ్‌ ఆందోళనలు నిజం చేస్తూ రోజూ వేలాదిమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఈ వైరస్‌ బాధితుల జాబితాలో చేరుతున్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కొవిడ్‌కు గురవుతున్నారు. తాజాగా ప్రముఖ కోలీవుడ్‌ హీరో అరుణ్‌ విజయ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ‘బ్రూస్‌లీ’, ‘సాహో’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించిన ఈ స్టైలిష్‌ యాక్టర్‌ వైరస్ బారినపడినట్టు బుధవారం తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు.

‘నాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాను. వైద్యుల సలహా మేరకు ఇక్కడే చికిత్స తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ తన అభిమానులను కోరాడు అరుణ్‌. కాగా తమిళ సినీ పరిశ్రమలో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. మీనా ఫ్యామిలీ ఇటీవల ఈ మహమ్మారి బారిన పడింది. అంతకుముందు వడివేలు, అర్జున్‌, విక్రమ్‌, కమల్‌ హాసన్‌ తదితర ప్రముఖులు కూడా కరోనాకు చిక్కారు.

Also Read:

Viral video: అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో..

S. Thaman : శివకార్తికేయన్ తెలుగు సినిమాకు మ్యూజిక్ మొదలుపెట్టిసిన తమన్.. ఆసక్తికర ట్వీట్

Asaduddin Owaisi: సర్టిఫికేట్ పొందిన బిచ్చగాడు అఖిలేష్ యాదవ్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ