Allu Arjun’s Pushpa: అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ ఎంత ముట్టజెప్పిందో తెలుసా.?

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఈ ఇద్దరి కాంబో లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

Allu Arjun's Pushpa: అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ ఎంత ముట్టజెప్పిందో తెలుసా.?
Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 06, 2022 | 3:45 PM

Allu Arjun’s Pushpa: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఈ ఇద్దరి కాంబో లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్నీ భాషల్లో పుష్ప సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. మునుపెన్నడూ కనిపించాను ఊర మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు బన్నీ. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ అతి తక్కువ సమయంలోనే 300 కోట్ల ట్రేడ్ మార్క్‏ను దాటేసి విజయవంతంగా దూసుకుపోతుంది. తాజాగా పుష్ప చిత్రయూనిట్ ఆడియన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల7న పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ భారీ మొత్తంలో దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది. కేవలం సౌత్ లాంగ్వేజ్ ల కోసం అమెజాన్ ప్రైమ్ 22 కోఇట్ల వరకు చెల్లించిందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. అలాగే హిందీ రైట్స్ కోసం 8 నుంచి 10 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దాంతో మొత్తంగా పుష్ప సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ 30 కోట్ల వరకు దక్కించుకుందని అంటున్నారు. అంత భారీ మొత్తంను థియేటర్ రిలీజ్ తర్వాత ఏ సౌత్ సినిమా కూడా రాబట్టలేదు. ఇక కరోనా.. ఓమైక్రాన్ దెబ్బకు సంక్రాంతికి రావలిసిన సినిమాలన్నీ వాయిదా వేసుకుంటున్నాయి. దాంతో బాలయ్య అఖండ, పుష్ప సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాయి. థియేటర్‌లో అదరగొట్టిన పుష్ప సినిమా ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Siri-Srihan: ఇన్‏స్టాలో సిరి ఫోటోలను డిలీట్ చేసిన శ్రీహాన్.. బ్రేకప్ దిశగా లవ్ బర్డ్స్ ?..

పీఎం మోడీకి భద్రత కల్పించకపోవడంపై మండిపడిన కంగనా.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ విమర్శలు

Acharya: ఆచార్య స్పెషల్ సాంగ్ పై వివాదం.. ఆ లిరిక్ తమ మనోభావలను దెబ్బతీసిందంటూ..