Viral video: అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో..

క్రికెటర్లు, సినీతారలకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు ఎక్కడ తారసపడినా సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు పోటీపడుతుంటారు.

Viral video: అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో..
Jack Leach
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2022 | 3:12 PM

క్రికెటర్లు, సినీతారలకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు ఎక్కడ తారసపడినా సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు పోటీపడుతుంటారు. ఇవి సాధ్యంకాకపోతే తమ ఫేవరెట్‌ స్టార్‌ నుంచి కనీసం ఆటోగ్రాఫ్‌ అయినా తీసుకుంటుంటారు. సాధారణంగా తమ అభిమాన క్రికెటర్లు, స్టార్ల నుంచి ఆటోగ్రాఫ్‌ తీసుకునేందుకు చాలామంది ప్రత్యేకంగా ఒక బుక్‌ను మెయింటెన్‌ చేస్తుంటారు. ఇక క్రికెటర్ల అభిమానులు అయితే బ్యాట్‌, క్యాప్‌, జెర్సీ తదితర వాటిపై ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటుంటారు. అయితే తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ మైదానంలో ఓ అభిమాని బ‌ట్టతలపైనే క్రికెట‌ర్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో గ్యాలరీలోని ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయినా తర్వాత చప్పట్లు కొడుతూ కేరింతలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. యాషెస్‌ సిరీస్‌లో భాగంగాఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా నిన్న(జనవరి5) నాలుగో టెస్టు ప్రారంభ‌మైంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే వరుణుడు ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించాడు. అయితే ఈ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌లీచ్‌ను ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కొంద‌రు అభిమానులు కోరారు. ఫ్యాన్స్‌ కోరికను కాదనలేని జాక్‌ ఓ అభిమాని వ‌ద్దకు వెళ్లి అత‌డి బట్టతలపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈఘటనతో గ్యాలరీలోని అభిమానులందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆతర్వాత చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. కాగా ఈ దృశ్యాల‌ను మైదానంలోని లైవ్ స్క్రీన్‌ లో కూడా చూపించడం విశేషం. మరి మీరు కూడా ఈ ఫన్నీ వీడియోను చూసి సరదాగా నవ్వుకోండి.

Also Read:

Telangana: థర్డ్ వేవ్ మొదలైంది.. కార్యక్రమాలు రద్దు చేసుకోండి.. డీహెచ్ శ్రీనివాసరావు

గుడ్‌న్యూస్.. QR కోడ్‌ని స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా.. పూర్తి వివరాలు ఇవే..

దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు.. ఎన్నికల వాయిదానే శ్రేయస్కరమా.?