IND vs SA: రెండో టెస్టులో టీమిండియా ఓటమి.. దక్షిణాఫ్రికాకు గెలిపించిన కెప్టెన్ ఎల్గర్.. సిరీస్ సమం..
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్(96 నాటౌట్)
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్(96 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. తాజా విజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్ 1-1 తో సమమైంది. సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ జనవరి 11న ప్రారంభమవుతుంది. కాగా సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌లో భారతజట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈ టెస్ట్‌లో విజయం సాధించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగులు సాధించాల్సిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 118/2తో నిలిచింది.
ఇక నాలుగోరోజు చేతిలో 8 వికెట్లు, 122 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు వరుణుడు స్వాగతం పలికాడు. దీంతో తొలి రెండు సెషన్ల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయితే మూడో సెషన్ సమయానికి వర్షం ఆగిపోవడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. సెషన్ ప్రారంభంకాగానే డెస్సన్(40) వికెట్ తీసిన మహ్మద్ షమీ టీమిండియా విజయంపై ఆశలు రేకెత్తించాడు. కానీ కెప్టెన్ డీన్ ఎల్గర్, తెంబా బవుమా(23) భారత అభిమానుల ఆశలపై నీల్లు చల్లారు. ముఖ్యంగా కెప్టెన్ డీన్ ఎల్గర్ టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో తన జట్టకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతనికి మార్‌క్రమ్(31), పీటర్సెన్(28), డస్సెన్, బవుమా సహకరించారు. భారత బౌలర్లలో షమీ, శార్దూల్, అశ్విన్ తలా ఒక వికెట్ తీశారు. కాగా కెప్టెన్సీ ఇన్సింగ్స్‌తో ఆకట్టుకున్న డీన్ ఎల్గర్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
South Africa win the second Test by 7 wickets.
The series is now leveled at 1-1. #TeamIndia will bounce back in the third Test. ? ? #SAvIND
Scorecard ▶️ https://t.co/b3aaGXmBg9 pic.twitter.com/s5z3Z01xTx
— BCCI (@BCCI) January 6, 2022
Also read:
Viral video: నీళ్లకు బదులు ఉమ్మితో హెయిర్ స్టైలింగ్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
Viral video: మ్యాగీని చెడగొట్టేశారంటూ మండిపడుతున్న నెటిజన్లు.. కారణమేంటంటే..