Viral video: మ్యాగీని చెడగొట్టేశారంటూ మండిపడుతున్న నెటిజన్లు.. కారణమేంటంటే..

మ్యాగీ.. నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకాన్ని చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా, స్నాక్స్‌గా ఎక్కువగా తీసుకుంటుంటారు. స్ట్రీట్ ఫుడ్ లో కూడా మ్యాగీకి ప్రత్యేక స్థానముంది. ఈక్రమంలోనే చాలామంది మ్యాగీతో రకరకాల ప్రయోగాలను చేస్తూ ఆహార ప్రియులను

Viral video: మ్యాగీని చెడగొట్టేశారంటూ మండిపడుతున్న నెటిజన్లు.. కారణమేంటంటే..
Coco Cola Maggi
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2022 | 8:42 PM

మ్యాగీ.. నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకాన్ని చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా, స్నాక్స్‌గా ఎక్కువగా తీసుకుంటుంటారు. స్ట్రీట్ ఫుడ్ లో కూడా మ్యాగీకి ప్రత్యేక స్థానముంది. ఈక్రమంలోనే చాలామంది మ్యాగీతో రకరకాల ప్రయోగాలను చేస్తూ ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఇందులో కొన్ని ఆకట్టుకుంటుంటే..మరికొన్ని బెడిసికొడుతున్నాయి. కాగా కొన్ని రోజుల క్రితం ‘మ్యాగీ షర్‌బత్‌’ అంటూ ఓ వ్యాపారి నెటిజన్లకు చికాకు తెప్పించగా.. ఇటీవల తందూరీ మ్యాగీ అంటూ మరొకరు మ్యాగీపై విరక్తి తెప్పించారు. తాజగా ఘజియాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి కూడా నీళ్లకు బదులు కోకాకోలా వేసి మ్యాగీని తయారుచేశాడు. దీనిపై కూడా నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ‘మీదేం టేస్టురా బాబూ’ అంటూ ఈసడించుకుంటున్నారు. కాగా దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఇటీవల కొంతమంది విభన్న రోజులంటూ తినే ఆహార పదార్థాలపై వివిధ రకాల ప్రయోగాలు చేస్తున్నారు. వివిధ రకాల కాంబినేషన్లతో కలిపి వంటకాలను తయారుచేస్తున్నారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అలా తాజాగా భుక్కడ్ ఢిల్లీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ‘ కోకాకోలా మ్యాగీ’ తయారు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. ఈ వీడియోలో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి ముందుగా ఒక ప్యాన్‌లో నూనె, కూరగాయలను పోస్తాడు. ఆ తర్వాత ఉప్పు, కొన్ని మసాలా దినుసులు జోడిస్తాడు. అయితే ఇప్పుడు నీళ్లకు బదులు కోకా కోలా డ్రింక్‌ వేసి ఉడికిస్తాడు. ఆతర్వాత మ్యాగీ మసాలా జోడిస్తాడు. దీంతో కోకాకోలా మ్యాగీ తయారీ పూర్తవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ ప్లీజ్‌ ఇలాంటివి ఆపండి.. మ్యాగీ నాశనమైంది. రుచికరమైన వంటకాన్ని ప్రయోగం పేరుతో చెడగొట్టారు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ కోకాకోలా మ్యాగీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:

Manchu Lakshmi: కరోన బారిన పడిన మంచువారమ్మాయి.. కలరీ స్కిల్స్‌తో వైరస్‌ను కిక్ చేస్తానంటూ పోస్ట్..

Viral news: నాపేరు కొవిడ్‌.. నేను వైరస్‌ను కాదు.. నెట్టింట్లో మార్మోగుతున్న బెంగళూర్ ఎంటర్ ప్రెన్యూర్ పేరు..

Viral video: అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో..

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే