Viral video: నీళ్లకు బదులు ఉమ్మితో హెయిర్ స్టైలింగ్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
పొడవాటి, పట్టులాంటి శిరోజాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే తమ కురులు పొడవుగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అందుకోసం ఎన్నో చిట్కాలు, హెయిర్ స్టైలింగ్ పద్ధతులను
పొడవాటి, పట్టులాంటి శిరోజాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే తమ కురులు పొడవుగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అందుకోసం ఎన్నో చిట్కాలు, హెయిర్ స్టైలింగ్ పద్ధతులను పాటిస్తారు. ఈ క్రమంలో తన కురులను అందంగా, ఆరోగ్యంగా మల్చుకోవాలని సెలూన్‌కెళ్లిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి హైయిర్ స్టైలిష్ట్ నీటికి బదులు ఉమ్మి వాడడం ఆయువతితో పాటు చాలామందికి కోపం తెప్పించింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఈ ఘటన జరిగింది. కాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యూపీకి చెందిన జావేద్ హబీబ్‌కు ఆ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో హెయిర్‌స్టైలిష్ట్‌గా మంచి గుర్తింపు ఉంది. కాగా ఇటీవల అతని బ్యూటీ పార్లర్‌కు పూజా గుప్తా అనే యువతి వచ్చింది. కాగా ఆ యువతి సెలూన్ ఛైర్ లో కూర్చోని ఉండగా జావేద్ దువ్వెనతో ఆమె జుట్టును సరిచేశాడు. అనంతరం హెయిర్ కేర్ టిప్స్ చెప్పాడు ‘నా జుట్టు మురికిగా ఉంది. అలా ఎందుకు ఉందంటే నేను షాంపు వాడను. ఒకవేళ నీళ్లు లేకపోతే ఉమ్మితోనే జట్టును శుభ్రం చేసుకోవాలి’ అంటూనే పూజ తలపై ఉమ్మి వేసేశాడు. కాగా తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుని వాపోయింది బాధితురాలు. ‘ జావేద్ హబీబ్ సార్ సెమినార్‌కు వెళ్లా. హెయిర్ కట్ చేయడానికి స్టేజి మీదకు పిలిచారు. నీరు లేకపోతే ఉమ్మితోనే హెయిర్ కట్ చేయాలంటూ ఆయన నాతో తప్పుగా ప్రవర్తించారు. ఇది నాకు ఏ మాత్రం నచ్చలేదు. అందుకే అతనితో హెయిర్ కట్ చేయించుకోలేదు. రోడ్ పక్కన సెలూన్ లో అయినా చేయించుకుంటాను గానీ, జావేద్ హబీబ్ దగ్గరకు వెళ్లను’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ ఘటనపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. జావేద్ సిగ్గుమాలిన పని చేశాడని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా తాజా వివాదంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని మహిళా చైర్ పర్సన్ రేఖా శర్మ ఉత్తర ప్రదేశ్ పోలీసులను కోరారు.
Thook in Tandoor Thook in Vegetables & Fruits Thook in Food
And now
Thook on the head
Most distressing is the laughter & clapping of the Kafir girls. Bollywood has gradually made them so foolish & dumb to idol worship these thookiyas https://t.co/ldxzTGThqe
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) January 6, 2022
Also read:
Viral video: మ్యాగీని చెడగొట్టేశారంటూ మండిపడుతున్న నెటిజన్లు.. కారణమేంటంటే..
Manchu Lakshmi: కరోన బారిన పడిన మంచువారమ్మాయి.. కలరీ స్కిల్స్‌తో వైరస్‌ను కిక్ చేస్తానంటూ పోస్ట్..