Coronavirus: కరోనా టెర్రర్.. ఫ్లైట్ లో ప్రయాణించిన 170 మందిలో125 మందికి పాజిటివ్‌..! ఎయిర్ ఇండియా క్లారిటీ

ఇటలీ నుంచి వచ్చిన ఓ విమానంలో  కొవిడ్‌ కలకలం సృష్టించింది.  పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న ఈ విమానంలో పెద్ద ఎత్తున ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు.

Coronavirus: కరోనా టెర్రర్.. ఫ్లైట్ లో ప్రయాణించిన 170 మందిలో125 మందికి పాజిటివ్‌..! ఎయిర్ ఇండియా క్లారిటీ
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2022 | 4:30 PM

ఇటలీ నుంచి వచ్చిన ఓ విమానంలో  కొవిడ్‌ కలకలం సృష్టించింది.  పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న ఈ విమానంలో పెద్ద ఎత్తున ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు. మొత్తం 175 మంది ప్రయాణికుల్లో ఏకంగా 125 మంది ప్రయాణికులకు కరోనా సోకిందని అమృత్‌ సర్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్ వీకే సేథ్ వెల్లడించారు. ‘ఇటలీ రాజధాని రోమ్‌ నుంచి ఓ అంతర్జాతీయ విమానం అమృత్‌సర్‌కు వచ్చింది. కరోనా ఆంక్షల్లో భాగంగా ప్రయాణికులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. అందులో 125మందికి పాజిటివ్‌గా తేలింది ‘ అని డైరెక్టర్ వీకేసేథ్ తెలిపారు. కాగా కరోనా బాధితుల్లో ఎంతమందికి ఒమిక్రాన్‌ సోకిందో ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రపంచంతో పాటు మన దేశంలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. మూడో వేవ్‌ ఆందోళనలను నిజం చేస్తూ కుప్పలు తెప్పులుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత కొంత కాలంగా రోజుకూ పదివేలకు దిగువనే నమోదవుతున్న కరోనా కేసులు ఈరోజు (జనవరి5) లక్షదాకా సమీపించడం దేశంలో కొవిడ్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కట్టడి కోసం భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని, ఆంక్షలు పటిష్ఠం చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.

మేం రోమ్ నుంచి ఎలాంటి విమానాలు నడపడం లేదు: ఎయిర్ ఇండియా

కాగా రోమ్ నుంచి వచ్చిన ఈ విమానం ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ కు చెందిన దని వార్తలు వచ్చాయి. దీనిపై ఎయిర్ ఇండియా స్పష్టత నిచ్చింది. ప్రస్తుతం తాము ఇటలీ నుంచి ఎలాంటి విమానాలు నడపడం లేదని ట్వీట్ పెట్టింది.

Also Read:

Viral video: అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో..

Coronavirus: సినిమా ఇండస్ట్రీలో కరోనా టెన్షన్‌.. వైరస్‌ బారిన మరో కోలీవుడ్‌ హీరో..

Omicron Cases: చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. దేశంలో మొత్తం కేసులు ఎన్నంటే..?