Viral news: కొవిడ్‌ వ్యాక్సిన్‌ గురించి ఆలుమగల మధ్య గొడవ.. పిల్లల్ని కిడ్నాప్‌ చేసిందని భార్యపై భర్త ఫిర్యాదు..

ఆలుమగల మధ్య ప్రేమ, ఆప్యాయతలతో పాటు అప్పుడప్పుడూ అలకలు, గొడవలు సహజంగా ఉండేవే. అయితే అనుకోని అతిథిలా మన జీవితాల్లోకి వచ్చిన కరోనా ఓ జంట మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. ఎంతలా అంటే ఏకంగా ఓ తల్లి తన పిల్లల్ని తానే కిడ్నాప్‌ చేసేంతలా

Viral news: కొవిడ్‌ వ్యాక్సిన్‌ గురించి ఆలుమగల మధ్య గొడవ.. పిల్లల్ని కిడ్నాప్‌ చేసిందని భార్యపై భర్త ఫిర్యాదు..
Covid Vaccine
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2022 | 5:01 PM

ఆలుమగల మధ్య ప్రేమ, ఆప్యాయతలతో పాటు అప్పుడప్పుడూ అలకలు, గొడవలు సహజంగా ఉండేవే. అయితే అనుకోని అతిథిలా మన జీవితాల్లోకి వచ్చిన కరోనా ఓ జంట మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. ఎంతలా అంటే ఏకంగా ఓ తల్లి తన పిల్లల్ని తానే కిడ్నాప్‌ చేసేంతలా. చాలా ఆశ్చర్యంగానూ, వింతగానూ ఉన్న ఈ సంఘటనకు సంబంధించి అసలు విషయంలోకి వెళితే.. స్పెయిన్‌లోని సెవిల్లె సమీపంలో నివశిస్తున్న ఒక తండ్రి తన కొడుకులని తల్లే స్వయంగా కిడ్నాప్‌ చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కిడ్నాప్‌నకు కారణమేంటని పోలీసులు అడగ్గా అతను చెప్పిన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. పిల్లలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌లు వేయించడానికి వీల్లేదంటూ తన భార్య పిల్లలను కిడ్నాప్‌ చేసిందని ఆ భర్త చెప్పడం గమనార్హం.

కాగా తన పిల్లలకు కోవిడ్‌ వేయించాలా వద్ద అనే నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉందని కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశాడు. అయితే కోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిరోజుల్లోనే పిల్లలను స్కూల్‌కి పంపిచడం మానిపించేయాలనుకుంటున్నట్లు అతని భార్య నుంచి ఒక లెటర్‌ కూడా వచ్చిందని అతను తెలిపాడు. పైగా తన అనుమతి లేకుండానే పిల్లలను తీసుకువెళ్లిందన్నాడు. నవంబర్‌ 4 నుంచి తన పిల్లలను చూడలేదని ఈ సందర్భంగా అతను వాపోయాడు. కాగా ఫిర్యాదుదారుని భార్య కూడా తన ఇద్దరు పిల్లలను తీసుకుని కోర్టుకు వెళ్లి అధికారులను ఆశ్రయించింది. అయితే కోర్టులో ఆమెపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది. ఈక్రమంలో ఆ పిల్లలిద్దర్నీ తండ్రికి అప్పగించినట్లు స్పెయిన్ గార్డియా సివిల్ పోలీస్ ఫోర్స్ ప్రతినిధి చెప్పుకొచ్చారు. కాగా వీరిద్దరూ గతంలోనే విడాకులు తీసుకున్నారని, ప్రస్తుతం విడిగానే ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు.

Also Read:

Coronavirus: కరోనా టెర్రర్.. ఫ్లైట్ లో ప్రయాణించిన 170 మందిలో125 మందికి పాజిటివ్‌..! ఎయిర్ ఇండియా క్లారిటీ

Coronavirus: సినిమా ఇండస్ట్రీలో కరోనా టెన్షన్‌.. వైరస్‌ బారిన మరో కోలీవుడ్‌ హీరో..

iral video: అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ