Man Sentenced: 12మంది బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడికి యావజ్జీవ శిక్ష!
అమ్మాయిల జీవితాలతో ఆటలాడతూ అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయ్యింది. 12 మంది బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన నరరూప రాక్షకుడికి యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు.
Man Sentenced Molested Case: అమ్మాయిల జీవితాలతో ఆటలాడతూ అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయ్యింది. 12 మంది బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన నరరూప రాక్షకుడికి యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును గురువారం జిల్లా కోర్టు వెలువరించింది. బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు హరీష్ నాయక్ కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించిన జిల్లా పొక్సో కోర్టు.
నల్లగొండ జిల్లా పెద్దవూర ఏనమిది తండాకు చెందిన విలేజ్ రీకన్‌స్ట్రక్షన్ అర్గనైజేషన్ (VRO) అనే స్వచ్ఛంద సంస్థ హస్టల్ విద్యార్థులు చదువుకుంటున్నారు. 2014 జనవరి 3వ తేదీన 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు రమావత్ హరీష్ నాయక్. ప్రతి రోజు ఒకరి చొప్పున అఘాయిత్యానికి పాల్పడ్డాడని విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి, కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా మొదటి అదనపు సెషన్ పోక్సో కోర్టు తుది తీర్పు వెలువరించింది.
ఈ కేసులో నిందితుడు రమావత్ హరీష్ నాయక్ సహా VRO స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్ రావు, సరితలను కూడా దోషులుగా నిర్దారించింది కోర్టు. ఏ1 నిందితుడు హరీష్ నాయక్ కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది. కాగా, ఈ కేసుకు సంబంధించి పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది కోర్టు.
Read Also… Crime News: నిశ్చితార్థం జరిగిన బాలికపై లైంగిక దాడి, ఆపై రాళ్లతో కొట్టి దారుణ హత్య!