Sexual assault victims need protection: లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు పూర్తి రక్షణ కల్పించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల బాధితులు తమపై దాడికి పాల్పడ్డారని చెప్పడానికి చాలా ధైర్యం కావాలని.. అందుకు వారికి పూర్తి రక్షణ కల్పించాలని ధర్మాసనం పేర్కొంది. కేసు దర్యాప్తు సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపింది. లైంగిక వేధింపుల కేసు విచారణలో కేరళ హైకోర్టు గురువారం ఈ ప్రకటన చేసింది.
బాధితులు తమపై లైంగిక దాడి జరిగిందని చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని, అలా ముందుకొచ్చిన వారిని అపహాస్యం చేయరాదంటూ పోలీసులకు సూచించింది. ఈ సందర్భంగా జస్టిస్ దేవన్ రామచంద్రన్ మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల కేసు విచారణ సమయంలో బాధితులకు సమాజం నుంచి వేధింపులు ఎదురవకుండా ఏం చేయాలో సూచనలు, సలహాలివ్వాలని న్యాయవాదులను కోరారు. బాధితులను వేధించే వారిని, ఎగతాళి చేసేవారిని అవసరమైతే అరెస్టు చేయాలంటూ ఆదేశించారు.
ఒక మహిళ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసి.. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మళ్లీ పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. ఆరోపణలు నిజమా కాదా అన్నది విచారణలో తేలుతుందన్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఓ బాధితురాలు తనకు రక్షణ కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. Also Read: