Viral Video: 14 ఏళ్లు లేకపోయినా స్కూటీ నడుపుతూ చిక్కిన కుర్రాడు.. బడ్డోడి సమాధానంతో ట్రాఫిక్‌ పోలీసుల షాక్!

Viral Video: 14 ఏళ్లు లేకపోయినా స్కూటీ నడుపుతూ చిక్కిన కుర్రాడు.. బడ్డోడి సమాధానంతో ట్రాఫిక్‌ పోలీసుల షాక్!
Minor Driving

మా నాన్న చిరంజీవి అనేది సినిమా టైటిల్.. కానీ ఇక్కడ మాత్రం మా నాన్న పొలిటికల్‌ లీడర్‌ అంటున్నాడు ఓ బుడతడు. నిండా 14 ఏళ్లు లేకపోయినా స్కూటీ నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు.

Balaraju Goud

|

Jan 06, 2022 | 5:02 PM

Minor Driving Viral Video: మా నాన్న చిరంజీవి అనేది సినిమా టైటిల్.. కానీ ఇక్కడ మాత్రం మా నాన్న పొలిటికల్‌ లీడర్‌ అంటున్నాడు ఓ బుడతడు. నిండా 14 ఏళ్లు లేకపోయినా స్కూటీ నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు.

హెల్మెట్‌ లేదు.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదు.. నిండా 14 ఏళ్లు కూడా లేవు.. కానీ స్కూటీ మీద వెళ్తూ ట్రాఫిక్‌ పోలీసులనే బెదిరిస్తున్నాడు ఓ బుడతడు. ఇంతకీ ఆ బాలుడి పొగరుకి కారణం ఏంటి ? అని ఆరా తీస్తే అతడో స్థానిక రాజకీయ నేత కుమారుడు. దీంతో డ్రైవింగ్స్‌ లైసెన్స్‌ లేకపోయినా రూల్స్‌ని బేఖాతర్‌ చేస్తూ దర్జాగా స్కూటీతో పాటు పట్టణంలో రోడ్డు మీదకి వచ్చాడు.

సిద్దిపేటలో వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు స్కూటీ మీద వెళ్తున్న ఓ బాలుడిని ఆపేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉందా? అని ఆరా తీశారు. అయితే తనకు ఏమీ లేవని, మా నాన్న ఎంపీటీసీ కనుక తనను ఆపకూడదని ట్రాఫిక్‌ పోలీసులకే ఎదురు సమాధానం ఇచ్చాడా బాలుడు. నన్నే ఆపుతారా అంటు వీర లెవల్లో రెచ్చిపోయాడు.

దీంతో బాలుడి తండ్రికి ఫోన్‌ చేశారు ట్రాఫిక్‌ పోలీసులు. 8వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలుడి చేతికి స్కూటీని ఎలా ఇచ్చారని క్లాస్‌ తీసుకున్నారు. పెద్ద వాళ్లు ఎవరైనా వస్తేనే స్కూటీని ఇస్తామని, లేదంటే ఇక్కడే ఉంటుందని తెలిపారు. మరోసారి మైనర్‌ బాలుడికి స్కూటీ ఇచ్చి రోడ్డు మీదకి వదిలేస్తే బండి సీజ్‌ చేస్తామని బాలుడి తండ్రికి వార్నింగ్‌ ఇచ్చారు ట్రాఫిక్‌ పోలీసులు. మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతి లేదని మరోసారి గుర్తు చేశారు.

Read Also… Viral news: కొవిడ్‌ వ్యాక్సిన్‌ గురించి ఆలుమగల మధ్య గొడవ.. పిల్లల్ని కిడ్నాప్‌ చేసిందని భార్యపై భర్త ఫిర్యాదు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu