AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ఇది నాపై కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ట్విట్టర్ అకౌంట్ నిలిపివేతపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు.

Rahul Gandhi Twitter: దేశ రాజకీయాల్లో మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌కు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ట్వీట్‌తో రాజకీయాల్లో పెను సంచలనాలు జరుగుతోన్న రోజులివీ. ట్విట్టర్‌ వ్యవహారం ప్రస్తుత రోజుల్లో రాజకీయ...

Rahul Gandhi: ఇది నాపై కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ట్విట్టర్ అకౌంట్ నిలిపివేతపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు.
Rahul Gandhi Twitter
Narender Vaitla
|

Updated on: Aug 13, 2021 | 12:31 PM

Share

Rahul Gandhi Twitter: దేశ రాజకీయాల్లో మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌కు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ట్వీట్‌తో రాజకీయాల్లో పెను సంచలనాలు జరుగుతోన్న రోజులివీ. ట్విట్టర్‌ వ్యవహారం ప్రస్తుత రోజుల్లో రాజకీయ మలుపులు తీసుకుంటున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయనాయకులకు చెందిన ఖాతాలను బ్లాక్‌ చేయడం మళ్లీ తర్వాత యాక్టివ్‌ చేస్తూ ట్విట్టర్‌ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతాను నిలిపి వేసిన విషయం తెలిసిందే. తమ నిబంధనలకు విరుద్ధంగా ట్వీట్ చేసిన కారణంగానే రాహుల్‌ గాంధీ అకౌంట్‌ను బ్లాక్‌ చేసినట్లు ట్విట్టర్‌ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే తన ట్విట్టర్‌ ఖాతాను బ్లాక్‌ చేయడం పట్ల రాహుల్‌ గాంధీ స్పందించారు. ఈ క్రమంలో ఓ వీడియోను విడుదల చేశారు.

ఇందులో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘నా ట్విట్టర్‌ ఖాతాను మూసేసి ట్విట్టర్‌ రాజకీయ వ్యవస్థలోకి తలదూర్చింది. ఒక కంపెనీ మా పనిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం రాజకీయనాయకుడిగా నాకు నచ్చలేదు. ఇది రాహుల్‌ గాంధీపై చేసిన దాడి కాదు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై చేసిన దాడి. నాకు సుమారు 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు, ట్విట్టర్‌ వారి హక్కును అడ్డుకుంది. ఇది చట్ట వ్యతిరేకమే కాకుండా.. ట్విట్టర్‌ ఒక తటస్థ వేదిక అనే ఆలోచనను కూడా కాలరాసింది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ట్విట్టర్‌ అధికారంలో ఉన్న ప్రభుత్వం చెప్పే మాటలను వింటోంది. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. మేము పార్లమెంట్‌లో మాట్లాడలేకపోతున్నాం. మీడియా కూడా కంట్రోల్‌ ఉంది. ఈ సమయంలో మా అభిప్రాయాలను తెలిపేందుకు ట్విట్టర్‌ అనేది మాకు ఒక ఆశా జ్యోతిలా కనిపించింది. కానీ ప్రస్తుతం ట్విట్టర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు రాహుల్‌. ఇదిలా ఉంటే రాహుల్‌ గాంధీతో పాటు రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా, అజయ్‌ మాకేన్‌, సుస్మిత దేవ్‌, మాణిక్యమ్‌ ఠాగూర్‌ అకౌంట్‌లను సైతం ట్విట్టర్‌ తాత్కాలికంగా బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే.

Also Read: BJP: భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ పాద యాత్ర..

Joker Robbery: హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీకి యత్నం.. పోలీసులకు ఛాలెంజ్ విసిరిన జోకర్ దొంగ.. వీడియో వైరల్..

Covid-19 India: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. గత 24 గంటల్లో భారీగా పెరిగిన మరణాలు..

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!