Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joker Robbery: హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీకి యత్నం.. పోలీసులకు ఛాలెంజ్ విసిరిన జోకర్ దొంగ.. వీడియో వైరల్..

Joker Robber Mask: దొంగలు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు. దొంగతానానికి పాల్పడి.. దొరకకుండా ఉండేందుకు.. ఎన్నో ప్లాన్‌లు వేస్తున్నారు. తాజాగా ఓ దొంగ హాలీవుడ్ సినిమా తరహాలో

Joker Robbery: హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీకి యత్నం.. పోలీసులకు ఛాలెంజ్ విసిరిన జోకర్ దొంగ.. వీడియో వైరల్..
Atm
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 13, 2021 | 11:12 AM

Joker Robber Mask: దొంగలు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు. దొంగతానానికి పాల్పడి.. దొరకకుండా ఉండేందుకు.. ఎన్నో ప్లాన్‌లు వేస్తున్నారు. తాజాగా ఓ దొంగ హాలీవుడ్ సినిమా తరహాలో దొంగతానికి ప్రయత్నించాడు. ఏటీఏంలోకి జోకర్ బొమ్మతో వచ్చి దోపిడికి యత్నించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్లాన్ ఫలించకపోవడంతో చివరకు వెనుదిరిగాడు. ఈ సంఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రెండు ఏటీఎంలల్లో గురువారం తెల్లవారుజామున ఇలాంటి ఘటనే జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కురుంపనాయి ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలోకి ఓ వ్యక్తి హాలీవుడ్ తరహాలో.. జోకర్ బోమ్మ ముఖానికి తగిలించుకొని.. డ్రెస్ వేసుకుని వచ్చాడు. చేతులకు గ్లౌజులు తగిలించుకొని చేతిలో ఒక రాడ్‌ను తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత రాడ్ తీసుకొని.. ఏటీఎంలో నగదు కోసం విశ్వప్రయత్నాలు చేశాడు. మిషన్‌ను పగులకొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ చివరకు దొంగతనం విఫలయత్నం కావడంతో వెనుదిరిగాడు.

వీడియో.. 

కాగా.. ఏటీఏం మిషన్ ను దొంగ తన్నడంతో అలారం మోగింది. దీంతో బ్యాంకు మేనేజర్, సిబ్బంది అక్కడికి వెళ్లి చూశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఈ విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. అయితే.. అదే వ్యక్తి మరో మరో 15 కిలోమీటర్ల దూరంలోని ఓ ఏటీఏంలో దొంగతనానికి యత్నించాడని కరుంగల్ పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read:

Honor killing: యువతిని దారుణంగా చంపిన కుటుంబసభ్యులు.. మరో వర్గానికి చెందిన యువకుడితో..

Mass Shooting: ఇంగ్లాండ్‌‌లో కాల్పుల మోత.. దుండగుడితో సహా ఆరుగురు మృతి..