Honor killing: యువతిని దారుణంగా చంపిన కుటుంబసభ్యులు.. మరో వర్గానికి చెందిన యువకుడితో..
Family Kills Woman: యువతి ప్రియుడితో కలిసి పారిపోయింది. కొన్ని రోజులపాటు ప్రియుడితో కలిసి నివసించింది. అనంతరం ఇంటికి తిరిగి వచ్చింది. ఇది జీర్ణించుకోలేని కుటుంబసభ్యులు.. ఆ యువతిని
Family Kills Woman: యువతి ప్రియుడితో కలిసి పారిపోయింది. కొన్ని రోజులపాటు ప్రియుడితో కలిసి నివసించింది. అనంతరం ఇంటికి తిరిగి వచ్చింది. ఇది జీర్ణించుకోలేని కుటుంబసభ్యులు.. ఆ యువతిని దారుణంగా చంపారు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రికరించాలని చూసి.. పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్వాలియర్ ప్రాంతానికి చెందిన జానక్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతి (20) మరో వర్గానికి చెందిన యువకుడు ఇద్దరు ప్రేమించుకున్నారు. అనంతరం యువతి.. యువకుడితో జూన్ 5న ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా.. ఆమె ఆచూకీ లభించకపోవడంతో.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు జులై 7న తిరిగి రావడంతో పోలీసులు పర్యవేక్షణ నిమిత్తం ఉమెన్స్ షెల్టర్ హోమ్‌కు తరలించి రక్షణ కల్పించారు. ఈ క్రమంలో జులై 31న తన తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి యువతి సమ్మతించగా..పోలీసులు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
ఈ క్రమంలో ఇంటికి వెళ్లిన రెండు రోజుల తర్వాత ఆగస్టు 2న యువతి తండ్రి పోలీసు స్టేషన్‌కు వచ్చి తన కూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వాపోయాడు. ఆ తర్వాత పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలంలో యువతి మృతదేహం చూసి అనుమానాస్పద మృతిగా ఉందని భావించారు. మహిళ ఆత్మహత్య చేసుకోలేదని.. ఉరి వేసి చంపినట్లు ఫోరెన్సిక్ నిపుణుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం పోలీసులు ఆ యువతి తండ్రిని, కుటుంబసభ్యులను విచారించారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఆ యువతిని చంపి దాన్ని ఆత్మహత్యగా చిత్రించాలని ప్రయత్నించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
దీంతో ఆమె తండ్రి, సోదరుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి, సోదరుడిని ఇప్పటికే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దీంతోపాటు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: