Talibans: ఆప్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్న హింస.. తాలిబన్ల గుప్పిట్లోకి కాందహార్‌‌ నగరం..

Afghanistan Taliban: ఆఫ్ఘానిస్తాన్‌లో హింస చెలరేగుతోంది. అఫ్ఘానిస్థాన్‌ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు దూకుడును మరింత పెంచారు. ఇప్పటికే కీలక భూభాగాలను

Talibans: ఆప్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్న హింస.. తాలిబన్ల గుప్పిట్లోకి కాందహార్‌‌ నగరం..
Afghanistan Taliban
Follow us

|

Updated on: Aug 13, 2021 | 7:23 AM

Afghanistan Taliban: ఆఫ్ఘానిస్తాన్‌లో హింస చెలరేగుతోంది. అఫ్ఘానిస్థాన్‌ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు దూకుడును మరింత పెంచారు. ఇప్పటికే కీలక భూభాగాలను ఆక్రమించారు. గురువారం రాజధాని కాబూల్‌ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్నీ పట్టణాన్ని కూడా వశపరుచుకున్న తాలిబన్లు.. శుక్రవారం మరో కీలక పట్టణాన్ని సైతం స్వాధీనంలోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాబూల్‌-కాందహార్‌ జాతీయ రహదారిపై ఉన్న గజ్నీ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించిన అనంతరం.. కందహార్ పట్టణాన్ని సైతం పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు తాలిబన్లు ముజాహిదీన్ నగరం వరకు వచ్చినట్లు తాలిబాన్ ప్రతినిధి ట్వీట్ చేసినట్లు మీడియా వివరించింది. దీంతో ఆఫ్ఘాన్ ప్రభుత్వ బలగాలు నగారాన్ని వీడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. తాలిబన్లు కాందహార్, హెరాత్ నగరాలను స్వాధీనం చేసుకోవడం పెద్ద విజయంగా పేర్కొంటున్నారు.

గత కొన్ని రోజుల నుంచి తాలిబన్లు.. ఆఫ్ఘానిస్థాన్‌లోని 34 ప్రొవిన్షియల్ రాజధానులల్లో 12 కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. మూడింట రెండు వంతుల ప్రాంతాలను తాలిబన్లు వశపరుచుకున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం.. తాలిబన్లకు కీలక ప్రాతిపాదనలు చేసినట్లు సమాచారం. హింసకు స్వస్థి పలికితే.. తాలిబన్లతో అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధమని తెలిపింది. కాగా ఈ విషయంపై తాలిబన్లు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. దీంతో తాలిబన్ల ప్రకటన కోసం ప్రభుత్వం వేచిచూస్తోంది.

ఇదిలాఉంటే.. మరికొన్ని రోజుల్లో తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకునే అవకాశమున్నట్లు అమెరికా అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాబూల్ లోని యూఎస్ రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిని తరలించేందుకు సైన్యాన్ని పంపనున్నట్లు అమెరికా ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో దాదాపు 3వేల మంది సైన్యాన్ని మోహరించి.. తమ సిబ్బందిని తీసుకెళ్లనున్నట్లు అమెరికా తెలిపింది. దీంతోపాటు బ్రిటన్ సైతం తమ ప్రజలను తీసుకెళ్లేందుకు సైన్యాన్ని పంపనున్నట్లు వెల్లడించింది.

Also Read:

Talibans: హింస మానితే అధికారంలో భాగస్వామ్యం.. తాలిబన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆఫర్..?

Taliban: తాలిబన్ల అధీనంలో భారత ‘ఎటాక్ హెలికాప్టర్’ ! కుందుజ్ విమానాశ్రయం పూర్తిగా వశం