Taliban: తాలిబన్ల అధీనంలో భారత ‘ఎటాక్ హెలికాప్టర్’ ! కుందుజ్ విమానాశ్రయం పూర్తిగా వశం
నెల రోజుల్లో కాబూల్ నగరాన్ని తాలిబన్లు పూర్తిగా ఇతర ప్రాంతాలనుంచి వేరు చేయవచ్చునని, మూడు నెలల్లోనే ఈ నగరాన్ని తమ హస్తగతం చేసుకోవచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన వేళ.. ప్రధానమైన కుందుజ్ విమానాశ్రయంలో వీరు తిష్ట వేశారని తెలుస్తోంది.
నెల రోజుల్లో కాబూల్ నగరాన్ని తాలిబన్లు పూర్తిగా ఇతర ప్రాంతాలనుంచి వేరు చేయవచ్చునని, మూడు నెలల్లోనే ఈ నగరాన్ని తమ హస్తగతం చేసుకోవచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన వేళ.. ప్రధానమైన కుందుజ్ విమానాశ్రయంలో వీరు తిష్ట వేశారని తెలుస్తోంది. 2019 లో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం గిఫ్ట్ గా ఇచ్చిన ‘ఎటాక్ హెలికాఫ్టర్’ ఒకటి ఇప్పుడు వీరి అధీనంలో ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాడు ఆఫ్ఘన్ సర్కార్ కి ఇండియా ఇచ్చిన నాలుగు హెలీకాఫ్టర్లలో ఇది ఒకటి. వాటితో బాటు మూడు చీటా లైట్ యూటిలిటీ హెలికాఫ్టర్లు కూడా ఆ దేశ భద్రతా దళాలకు అందాయి. ఆఫ్గనిస్తాన్-బెలారస్ ఒప్పందం కింద భారత ప్రభుత్వం వీటిని అందజేసింది. పైగా ఆఫ్ఘన్ వైమానిక సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది. కాగా ఈ హెలికాఫ్టర్ లోని రాడార్ బ్లేడ్స్ ని ఆఫ్ఘన్ దళాలు ముందే తొలగించినట్టు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అంటే తాలిబన్ల నుంచి ఓటమి తప్పదని భావించి వీటిని తొలగించారని భావిస్తున్నారు. ఈ హెలికాఫ్టర్ వద్ద తాలిబన్లు తిరుగడుతున్నారంటే ఆఫ్ఘన్ దళాలకు వైమానిక మద్దతు కొరవడుతోందన్న విషయం కూడా స్పష్టమవుతోంది.
ఇప్పటికే ఆ దేశంలో తాలిబన్లు ఏడెనిమిదికి పైగా ప్రొవిన్షియల్ రాజధానులను హస్తగతం చేసుకున్నారు. ఈ నెల 31 తరువాత ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగిన అనంతరం ఆఫ్ఘన్ ప్రభుత్వం ఇండియా తదితర దేశాల సాయం కోరే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆ దేశానికి ఇండియా సైనిక పరంగా తోడ్పడే అవకాశాలు లేవు. తాలిబాన్లకు పాకిస్థాన్ మద్దతునిస్తున్న కారణంగా ఈ విధమైన యోచనేదీ ప్రభుత్వానికి లేదని అంటున్నారు. పైగా ఇండియా ఆఫ్ఘన్ ప్రభుత్వానికి సైనిక పరమైన మద్దతు ఇవ్వరాదని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ ఇటీవల కోరాడు.
Video reportingly shows #Taliban captured Kunduz airport with #Afghanistan Air Force Mi-35 Hind attack helicopter pic.twitter.com/u7jZJdR800
— Joseph Dempsey (@JosephHDempsey) August 11, 2021
دا عسکر د کندز له هوایي ډګر څخه را ووتل او له مجاهدینو سره د یو ځای کیدو په حال کې دي. د اسلامي امارت غیږه ټولو هغو کسانو ته خلاصه ده، چې د دښمن له صف څخه را جلا شي او د دعوت ارشاد ادارې له مسئولینو څخه د امن کارت تر لاسه کړي. دوی ته به د مجاهدینو لخوا هیڅ نوع خطر نه متوجه کیږي. pic.twitter.com/XXn6pGsn5q
— Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) August 11, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : హరీష్ రావు ఎంట్రీతో మరింత వేడెక్కిన హుజూరాబాద్ రాజకీయం..హోరెతించిన గులాబీ.:Huzurabad Politics Live Video.
బుర్జ్ ఖలీఫా హోటల్ పై మహిళ…ఇదెక్కడి యాడ్ రా మావా..!వీడియో వైరల్..:woman on Burj Khalifa Video.