Pakistan: పాకిస్తాన్ లో కోట్ల నగదుతో వ్యాన్ డ్రైవర్ పరారీ.. కరాచీ బ్యాంకు వద్దే ఘటన..
పాకిస్తాన్ లోని కరాచీలో ఓ వ్యాన్ డ్రైవర్ 200 మిలియన్ రూపాయలతో ఉడాయించాడు. ఓ సెక్యూరిటీ కంపెనీకి చెందిన హుసేన్ షా అనే డ్రైవర్ ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడు. బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ లో ఈ నగదును అందజేయాల్సి ఉండగా ..సెక్యూరిటీ గార్డు అటు బ్యాంకు లోపలి
పాకిస్తాన్ లోని కరాచీలో ఓ వ్యాన్ డ్రైవర్ 200 మిలియన్ రూపాయలతో ఉడాయించాడు. ఓ సెక్యూరిటీ కంపెనీకి చెందిన హుసేన్ షా అనే డ్రైవర్ ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడు. బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ లో ఈ నగదును అందజేయాల్సి ఉండగా ..సెక్యూరిటీ గార్డు అటు బ్యాంకు లోపలి వెళ్ళగానే ఇటు ఈ డ్రైవర్ పరారయ్యాడు. ఈ నెల 9 న పట్టపగలు జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ గార్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టి హుసేన్ షా కోసం గాలింపు ప్రారంభించారు. కరాచీలోని చంద్రగిరి రోడ్ లో పలు బ్యాంకులు ఉన్నాయి. ఇది అసాధారణమైన కేసు అని, ఇలా ఎప్పుడూ జరగలేదని, ఈ కారణంగా వివిధ కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.. ఈ దోపిడీ గురించి ఆయన వివరిస్తూ మహమ్మద్ సలీం అనే సెక్యూరిటీ గార్డు ఈ నగదును బ్యాంకులో ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉందని.. అతడు తిరిగి వచ్చేలోగా ఈ డ్రైవర్ పారిపోయాడని చెప్పారు. సలీం వెంటనే హుసేన్ షా కి ఫోన్ చేసినా అది స్విచాఫ్ అయి ఉందన్నారు.
అటు-సెంట్రల్ బ్యాంకుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ వ్యాన్ ను పోలీసులు కనుగొన్నారు. కానీ ఇందులోని నగదు, కొన్ని ఆయుధాలు, ఓ కెమెరా, డీవీఆర్ కూడా మిస్సయ్యాయి. వాటిని కూడా ఈ డ్రైవర్ అపహరించి ఉంటాడని తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : హరీష్ రావు ఎంట్రీతో మరింత వేడెక్కిన హుజూరాబాద్ రాజకీయం..హోరెతించిన గులాబీ.:Huzurabad Politics Live Video.
బుర్జ్ ఖలీఫా హోటల్ పై మహిళ…ఇదెక్కడి యాడ్ రా మావా..!వీడియో వైరల్..:woman on Burj Khalifa Video.