AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూ రాసిన మాజీ ఉద్యోగి.. పరువు నష్టం దావాతో షాకిచ్చిన కంపెనీ.. ఎంతో తెలుసా?

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వ్యాట్ ట్రోయా.. అంతకుముందు స్టార్టప్ కంపెనీ లోన్‌స్ట్రీట్ అనే సంస్థలో పనిచేశాడు...

సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూ రాసిన మాజీ ఉద్యోగి.. పరువు నష్టం దావాతో షాకిచ్చిన కంపెనీ.. ఎంతో తెలుసా?
Defamtion
Venkata Chari
|

Updated on: Aug 12, 2021 | 5:00 PM

Share

ఇది వరకు పనిచేసిన ఓ కంపెనీపై ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో విమర్శించినందుకు.. సదరు కంపెనీ ఆ మాజీ ఉద్యోగిపై పరువు నష్టం దావా వేసింది. వింతగా అనిపిస్తోందా.. నిజమేనండి బాబు. పూర్తి వివరాలు చదవండి మరి.. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వ్యాట్ ట్రోయా.. అంతకుముందు స్టార్టప్ కంపెనీ లోన్‌స్ట్రీట్ అనే సంస్థలో పనిచేశాడు. తాజాగా ఆ కంపెనీపై ఆన్‌లైన్‌‌లోని పలు ప్లాట్‌ఫాంలలో లోన్‌టెక్ కంపెనీపై విమర్శలు గుప్పిస్తూ రాసుకొచ్చాడు. దీంతో సదరు కంపెనీ వ్యాట్ ట్రోయాపై 1 మిలియన్ డాలర్లకు పరువు నష్టం దావా వేసింది. వ్యాట్ ట్రోయా.. గ్లాస్‌డోర్, రీడిట్‌తోపాటు పలు వెబ్‌సైట్లలో తను ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలు, తనను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారో అందులో పేర్కన్నాడు. ట్రోయా చేసిన వ్యాఖ్యలపై లోన్ స్ట్రీట్ తీవ్రంగా పరిగణించి, అతనిపై పరువు నష్టం దావా వేసింది.

అందులో పనిచేస్తున్నప్పుడే ఓసారి సదరు కంపెనీపై గ్లాస్‌డోర్ అనే రివ్యూ ప్లాట్‌ఫ్లామ్‌లో కంపెనీని విమర్శిస్తూ రివ్యూ రాశాడు. ‘కంపెనీ అధిపతులకు నైపుణ్యం లేదు. అలాగే వారు అనుభవజ్ఞులైన నాయకులు కాదు ఉద్యోగులపై చాల పక్షపాతంలో వ్యవహరిస్తుంటారు’ అంటూ ఏప్రిల్ 2020లో ట్రోయా రాసుకొచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన లోన్‌స్ట్రీట్ కంపెనీ అతనిని ఉద్యోగం నుంచి తొలగించింది. అనంతరం ట్రోయా ఒక సంవత్సరం తరువాత గ్లాస్‌డోర్‌లో మరోసారి లోన్‌స్ట్రీట్‌పై విమర్శలు గుప్పించారు. “మోసపూరితంగా వ్యవహరించి, నన్న దోపిడీ చేసిందంటూ” విమర్శించాడు. ” లోన్ స్ట్రీట్ కంపెనీకి చాలా దూరంగా ఉండండి. మీరు నిరాశ చెందకుండా ఉండాలంటే ఆ కంపెనీలో ఉద్యోగం చేయకండి. ఆ కంపెనీ మీ జీవితాలన ర్యాగింగ్ చేస్తుంది. మీ జీవితాలను కాల్చి వేస్తుంది. అంతకుముందు ఆ కంపెనీలో చాలామంది ఇబ్బందులకు గురయ్యారు’ అంటూ మరోసారి విమర్శలు గుప్పించారు.

లోన్‌స్ట్రీట్‌లో ట్రోయాను జాయిన్ చేసుకునేప్పుడు కంపెనీకి సంబంధించిన పదివేల డాలర్ల విలువగల షేర్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. అయితే, ఇవి రాతపూర్వకంగా మాత్రం ఇవ్వలేదని తెలిపాడు. అయితే, ఈ షేర్లను క్యాష్‌గా మార్చుకోవాలంటే మాత్రం 16 నెలల టైం పడుతుందని పేర్కొన్నట్లు తెలిపాడు. అయితే ఈ లోపే కంపెనీ నుంచి నన్ను తొలగించారని రాసుకొచ్చాడు.

ఈ మేరకు ఆగ్రహించిన లోన్‌స్ట్రీట్ సీఈవో ఇయాన్ లాంప్ల్ జులై 19న ట్రోయాపై దావా వేశారు. అతని ఆరోపణలు నిజం కాదని, ఇలాంటి వాటివల్ల కంపెనీకి చాలా నష్టం కలుగుతుందంటూ పేర్కొన్నాడు. కంపెనీ పేరుతో గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు తప్పుడు వార్తలు వస్తున్నట్లు కంపెనీ పరువునష్టం దావాలో పేర్కొంది. అలాగే ట్రోయాలో నైపుణ్యం లేదని, సహచరులతోనూ అసభ్యంగా ప్రవర్తించేవాడని అందుకే ఆయన్న ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కొన్నాడు. ట్రోయా అనాలోచిన ఆరోపణలతో లోన్‌స్ట్రీట్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 50 మంది ఉద్యోగుల జీవనోపాధిని నాశనం చేస్తున్నాడంటూ ట్రోయాపై విమర్శలు గుప్పించింది. ఇలా మొత్తానికి కంపెనీకి వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో రివ్యూలు పెట్టినుందుకు ట్రోయా మిలియన్ డాలర్ల పరువునష్టం దావాను ఎదుర్కొవాల్సి వచ్చింది.

Also Read: బర్త్ డే పార్టీలో చిన్న పాటి సినిమా చూపించిన రౌడీ షీటర్.. కారెక్కి తుపాకీతో గాల్లోకి కాల్పులు.. వీడియో వైరల్

Viral Video: జిరాఫీని మట్టుబెట్టి వేటాడిన సింహం.. మృగరాజు వేట చూస్తే ఆశ్చర్యపోతారంతే.!