AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్..

బేస్ ఏరియాల్లో సైతం మావోయిస్టుల ప్రభావం తగ్గినట్టు రిపోర్టులు వచ్చాయని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మావోయిస్టు కమిటీ మెంబర్ గత నెల సరెండర్ అయ్యారని.. ఈ రోజు ఆరుగురు మావోయిస్టులు

AP: లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్..
Ap Dgp
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 12, 2021 | 5:32 PM

AP DGP: బేస్ ఏరియాల్లో సైతం మావోయిస్టుల ప్రభావం తగ్గినట్టు రిపోర్టులు వచ్చాయని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మావోయిస్టు కమిటీ మెంబర్ గత నెల సరెండర్ అయ్యారని.. ఈ రోజు ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ చెప్పారు. వీరిలో డివిజనల్ కమాండర్‌ గాదర్ల రవితో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు.

స్థానిక సమస్యలపై గతంలో మావోయిస్టులు వచ్చి స్థానికులతో మాట్లాడేవారని చెప్పిన డీజీపీ.. ఇప్పుడు ప్రభుత్వం నుండి ఆదివాసీల అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని.. ట్రైబల్ ఏరియాల్లో 20 వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని తెలిపారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.

రక్తపాతం ద్వారా.. ఉద్యమం ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆదివాసీలకు అర్ధమైందని పేర్కొన్న డీజీపీ.. విద్య, వైద్యం సమస్యలు ఇప్పుడు ఆదివాసీలకు లేవన్నారు. “స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కోసం పోరాడదామని మావోయిస్టులు అంటున్నా గిరిజనులు ఆసక్తి చూపట్లేదు.. గతంలో ఏవోబీలో 8 మావోయిస్టు కమిటీలు ఉండేవి. ఇప్పుడు 4 కమిటీలు కూడా లేవు. అనేక మంది మావోలు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ప్రజాస్వామ్యంలో హింస, రక్తపాతం ద్వారా సాధించేది ఏదీ ఉండదు. ప్రజాస్వామ్యంలో వారికి ఉన్న హక్కు ప్రకారం వారిని జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరుతున్నాను.” అని డీజీపీ కోరారు.

“ఇప్పుడు రూరల్, ట్రైబల్ ఏరియాలకు ప్రభుత్వ కార్యక్రమాలు బాగా రీచ్ అవుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తుంది. నేరుగా లబ్దిదారులకు పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో నూతన పాలనా విప్లవం వచ్చింది. పోలీసు వ్యవస్థలోనూ అనేక మార్పులు వచ్చాయి. పోలీసుల భాష, ప్రవర్తనలో మార్పు వచ్చింది. పాడేరులో మెడికల్ కాలేజ్, బుట్టాయి గూడెం, రంప చోడవరంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.” అని డీజీపీ తెలిపారు.

Read also: Watch Video: రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆ స్కీమ్‌తో విశ్రాంత జీవితం ప్రశాంతం.. ది బెస్ట్ ప్లాన్ ఇదే..!
ఆ స్కీమ్‌తో విశ్రాంత జీవితం ప్రశాంతం.. ది బెస్ట్ ప్లాన్ ఇదే..!
కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఫ్లిప్‌కార్ట్‌ SASA LELE సేల్‌.. 50 శాతం తగ్గింపు!
ఫ్లిప్‌కార్ట్‌ SASA LELE సేల్‌.. 50 శాతం తగ్గింపు!
కొత్త ఫీచర్‌.. Gmailలో ఒకే క్లిక్‌తో అవాంఛిత మెయిల్స్ తొలగించండి!
కొత్త ఫీచర్‌.. Gmailలో ఒకే క్లిక్‌తో అవాంఛిత మెయిల్స్ తొలగించండి!
బంగారంలో పెట్టుబడికి ఇదే మంచి సమయం.. ఆర్థిక నిపుణుల సూచనలివే..!
బంగారంలో పెట్టుబడికి ఇదే మంచి సమయం.. ఆర్థిక నిపుణుల సూచనలివే..!
కేంద్ర క్యాబినేట్‌ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణన!
కేంద్ర క్యాబినేట్‌ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణన!
10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే