BJP: భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ పాద యాత్ర..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. భారీ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను మొదలు పెట్టనున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. భారీ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్రగా పేరు నిర్ణయించారు. ఈ మేరకు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో శుక్రవారం నాడు ఎమ్మెల్యే రాజా సింగ్, BJP నేతలు బాబు మోహన్, డాక్టర్ చంద్రశేఖర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్ర పేరును ప్రకటించారు. ఆగస్టు 24న భాగ్యలక్ష్మి ఆలయం నుంచే బండి సంజయ్ పాదయాత్ర ఆరంభం కానుందని MLA రాజా సింగ్ వెల్లడించారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
అయితే.. ఆగస్టు 9నే పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా వాయిదా పడింది. అయితే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేపథ్యంలో తన ఎంపీలకు BJP విప్ జారీచేయడంతో MP బండి సంజయ్ తప్పనిసరిగా ఢిల్లీలో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రను ఆగస్టు 24 నుంచి చేపట్టాలని నిర్ణయించారు.
మరోవైపు, కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి G. కిషన్‌రెడ్డి ఈనెల 16 నుంచి రాష్ట్రంలో యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలోనూ సంజయ్ పాల్గొనాల్సి ఉండటంతో ఆయా కారణాల దృష్ట్యా సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. కేంద్రంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈనెల 16న రాష్ట్రానికి వస్తున్న కిషన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద భారీగా కిషన్ రెడ్డికి స్వాగతం పలుకనున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాకే హుజూరాబాద్ నియోజకవర్గంలో సంజయ్ పాదయాత్ర చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వారం రోజుల పాటు ఆయన ఆ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా బీజేపీ వర్గాలు ప్లాన్ చేశాయి.
ఇవి కూడా చదవండి: Gupta Nidhulu: గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్.. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏం జరిగేదో..