TRS Spying: కేసీఆర్ రాడార్‌లో ఈటల ఫ్రెండ్స్..? సొంత పార్టీ నేతలపై నిఘా..!
టీఆర్ఎస్‌లో ఉన్న ఈటెల రాజేందర్ సన్నిహితులు ఏం చేస్తున్నారు.. హుజురాబాద్ ఉప ఎన్నికవేళ వారి యాక్టివిటీ ఎలా ఉంది.. ఇన్నాళ్లూ చురుగ్గా ఉన్న నేతలు ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు.
TRS Spying Operation – Etela Rajender – Huzurabad: టీఆర్ఎస్లో ఉన్న ఈటల రాజేందర్ సన్నిహితులు ఏం చేస్తున్నారు.. హుజురాబాద్ ఉప ఎన్నికవేళ వారి యాక్టివిటీ ఎలా ఉంది.. ఇన్నాళ్లూ చురుగ్గా ఉన్న నేతలు ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు. హుజురాబాద్ నియోజకవర్గంకు సమీపంగా ఉన్న ఎమ్మెల్యేల మూమెంట్ ఎలా ఉంది.? అనే అంశాలపై ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తరువాత టీఆర్ఎస్‌లో ఆయన సన్నిహితులు చాలా మంది సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయ్యాక ఈ నేతల మౌనం పై గులాబీ బాస్ కేసీఆర్ నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. నాటి నుండి నేటి వరకు ఆయన టీఆర్ఎస్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈటల అనేక కామెంట్స్ చేస్తున్నా వీరు ఏమీ స్పందించకపోవడం, దానికి తోడు బీజేపీ నేతలు.. ఈటల రాజేందర్ సన్నిహితులు టీఆర్‌ఎస్‌లో హ్యాపీగా లేరు, వాళ్లు బయటకు రావాలి అంటూ ప్రకటనలు చెయ్యడంతో వారి మూమెంట్స్ పై మానిటర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్‌లో ఉండగా ఈటల రాజేందర్‌కు చేవెళ్ల ఎంపీ, పెద్దపల్లి ఎమ్మెల్యే, మంథాని మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు ముఖ్యనేతలు సన్నిహితంగా ఉండేవారు. వీరిలో కొంతమంది నియోజకవర్గాలు హుజురాబాద్‌కు పక్క నియోజవర్గాలే అయినా వారికి ఉపఎన్నికలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు టీఆర్ఎస్. దానికి తోడు రీసెంట్‌గా ఢిల్లీలో బీజేపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చేవెళ్ల ఎంపీ టీఆర్ఎస్‌లో ఉండలేకపోతున్నాడు ఆయన పార్టీ వదిలి బీజేపీ లోకి రావాలని మాట్లాడటం జరిగింది.
దీంతో టీఆర్‌ఎస్ పెద్దలు అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. అటు పెద్దపల్లి ఎమ్మెల్యే కూడా మొదటి నుండి ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితుడు అవడంతో ఈ టైంలో ఆయన వైఖరి పై కూడా ఒక కన్నేసినట్టు తెలుస్తుంది. అటూ మంథాని మాజీ ఎమ్మెల్యేకు కూడా ఈటల రాజేందర్‌తో మంచి సంబంధాలు ఉన్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో గట్టిగానే ఉంది. దానికి తోడు ఆయన కూడా కొద్దిరోజుల నుండి సైలెంట్‌గానే ఉన్నారు.
దీంతో ఇలాంటి వారి అందరిపై టీఆర్ఎస్ లుక్ వేసినట్టు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకొని అభ్యర్థిని కూడా ప్రకటించి కేసీఆర్ బహిరంగ సభకు పనులు పూర్తి చేస్తున్న టీఆర్ఎస్ ఈ సమయంలో పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా అన్ని అంశాలపై పకడ్బందీగా నిఘా పెట్టినట్టు సమాచారం.
శ్రీధర్ ప్రసాద్, టీవీ9 రిపోర్టర్, హైదరాబాద్
Read also: Deadbody in Fridge: ఫ్రిడ్జ్ లో వృద్ధుడి శవం.. అంత్యక్రియలకు డబ్బులు లేక దాచానంటోన్న మనుమడు