Gupta Nidhulu: గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్.. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏం జరిగేదో..

Gupta Nidhulu: సుమారు ఓ 10మంది ఉంటారు. ఊరి చివర గుట్టపై తిష్ట వేశారు. హడావుడిగా వెళ్లి... ఏదో చేద్దామనుకున్నారు. ఇంతకీ వీళ్లందరికి గుట్టపైనే ఏం పని అనే డౌట్ గ్రామస్తులకు వచ్చింది. అదే డౌట్ వారి ప్లాన్‌కు అడ్డంకిగా మారింది. అంతే..

Gupta Nidhulu: గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్.. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏం జరిగేదో..
Gupta Nidhulu
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 13, 2021 | 6:46 AM

సుమారు ఓ 10మంది ఉంటారు. ఊరి చివర గుట్టపై తిష్ట వేశారు. హడావుడిగా వెళ్లి… ఏదో చేద్దామనుకున్నారు. ఇంతకీ వీళ్లందరికి గుట్టపైనే ఏం పని అనే డౌట్ గ్రామస్తులకు వచ్చింది. అదే డౌట్ వారి ప్లాన్‌కు అడ్డంకిగా మారింది. అంతే వాళ్ల సీన్‌ సితార్‌ అయింది. అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. ఏందో వాళ్లలో వాళ్లు మాట్లాడుకున్నారు. అక్కడే ఉన్న మరో వ్యక్తికి చేతుల్లో పేపర్లు. ఆధార్‌ కార్డులు చూపిస్తున్నారు. ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. సీన్‌ కట్ చేస్తే వీళ్లంతా వచ్చింది గుప్త నిధుల కోసం.. గుట్టలపై తవ్వకాలు జరపడానికి. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని కోమటిపల్లి గ్రామశివారుల్లో ఉన్న గుట్టపైన ఈదృశ్యాలు స్థానికంగా కలకలం రేపాయి.

గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో కొందరు స్థానికులు గుట్టుచప్పుడు కాకుండా.. బిహార్ కూలీలను బైకులతో సహా గుట్లపైకి చేరారు. ఇక తవ్వకాలు మొదలుపెట్టేందుకు సిద్ధం కావడంతో …వీళ్లందరికి గుట్టపైన ఏం పని అనే డౌట్ స్థానికులకు రావడంతో వెంటనే వాళ్లను ఫాలో అయ్యారు.

వాళ్లు వెలగబెడుతున్న ఘనకార్యం చూసి విస్తుపోయారు. వెంటనే గుప్తనిధుల తవ్వకాల కోసం వచ్చిన ఎనిమిది మందిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి…వీళ్లందరికి పోలీసులకు అప్పగించారు. గుప్త నిధుల కోసం అక్రమంగా గుట్టలపై తవ్వకాలు జరపుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. గుప్త నిధులు ఉన్నాయనే సమాచారం ఎవరిచ్చారని కూపీ లాగుతున్నారు.

ఇవి కూడా చదవండి: GPS Toll.. ఇకపై నో టోల్- నో ఫాస్టాగ్ ఓన్లీ జీపీఎస్.. సరికొత్త టోల్ బాజా.. దూరా భారాలను బట్టీ వాటికవే కట్

SBI కస్టమర్లకు శుభవార్త.. మీ సిమ్ కార్డును వెంటనే ధృవీకరించండి.. అప్పుడే మీరు ఈ పెద్ద సదుపాయాన్ని పొందుతారు..