AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GPS Toll.. ఇకపై నో టోల్- నో ఫాస్టాగ్ ఓన్లీ జీపీఎస్.. సరికొత్త టోల్ బాజా.. దూరా భారాలను బట్టీ వాటికవే కట్

క్రిప్టో కరెన్సీ.. ఇప్పుడిదే లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్ మెంట్. గోల్డ్- సిల్వర్- షేర్స్ లో పెట్టుబడి పెట్టేవారి చూపులున్నీ దీని వైపే ఉంటోంది. కాయిన్- నోట్ వంటి రూపంలో కాకుండా కేవలం.. స్క్రిప్ట్ లో మాత్రమే కనిపించే..

GPS Toll.. ఇకపై నో టోల్- నో ఫాస్టాగ్ ఓన్లీ జీపీఎస్.. సరికొత్త టోల్ బాజా.. దూరా భారాలను బట్టీ వాటికవే కట్
Toll Plaza
Sanjay Kasula
|

Updated on: Aug 12, 2021 | 10:56 PM

Share

నేషనల్ హైవేస్ పై ప్రయాణిస్తున్నపుడు.. టోల్ ప్లాజాలదో తలనొప్పి.. వేగంగా వెళ్తున్న వాహనానికి స్పీడ్ బ్రేకర్ లా ఎదురవటమే కాదు.. నిమిషాల కొద్దీ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. కానీ ఇపుడీ వెయింటింగ్ కి బ్రేకులు వేసే యత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ లను తెరపైకి తెచ్చారుగా.. ఇంకా ఏంటీ కొత్త మెథడ్ అంటే అదే జీపీఎస్ తో కూడిన టోల్ ఫీజుల వ్యవస్థ. అంటే, దీన్ని అత్యంత త్వరలోనే వాడకంలోకి తెస్తామంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వచ్చే రోజుల్లో టోల్ ప్లాజాలు- వాటిల్లోని బూత్ లను పూర్తిగా లేకుండా చేస్తామంటున్నారు కేంద్ర మంత్రి.

రష్యాకు చెందిన టెక్నాలజీ ద్వారా జీపీఎస్ అనే- గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పని చేస్తుందని అన్నారు నితిన్ గడ్కరీ. దీని ప్రకారం.. వాహనం ప్రయాణించే దూరాన్నిబట్టీ.. ఈ- వాలెట్ లేదా వాహన యజమాని బ్యాంక్ ఖాతా నుంచి టోల్ ఫీజు డిడెక్ట్ అవుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఎలెక్ట్రానిక్ టోల్ వ్యవస్థ అమల్లో ఉంది.. దీన్ని జాతీయ రహదారుల సంస్థ నిర్వహిస్తోంది.. ఇకపై దీన్ని కూడా లేకుండా చేస్తామనీ.. ఏడాది లోపు జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని లోక్ సభలో చెప్పారు నితిన్ గడ్కరీ. ప్రస్తుతం తయారవుతున్న వాహనాలన్నీ గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్ తో అనుసంధానమై ఉన్నాయ్. పాత బండ్లలో ఈ విధానాన్ని తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు కేంద్రమంత్రి గడ్కరీ.

ఇవి కూడా చదవండి:  Viral Photos: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న DDL బ్యూటీ కూతురు..  

Credit Card Payment: మీరు క్రెడిట్ కార్డు బిల్ పే చేసేముందు ఇలా చేస్తే బోలెడు డబ్బులు కలిసి వస్తాయి..