AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Payment: మీరు క్రెడిట్ కార్డు బిల్ పే చేసేముందు ఇలా చేస్తే బోలెడు డబ్బులు కలిసి వస్తాయి..

మీకు క్రెడిట్ కార్డు ఉందా..? క్రెడిట్ కార్డుల ఖర్చులు తడిసి మోడవుతున్నాయా..? క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక పోతున్నారా..? అయితే ఈ చిట్కాను పాటించాండి.. 

Credit Card Payment: మీరు క్రెడిట్ కార్డు బిల్ పే చేసేముందు ఇలా చేస్తే బోలెడు డబ్బులు కలిసి వస్తాయి..
Credit Card Payment
Sanjay Kasula
|

Updated on: Aug 12, 2021 | 6:53 PM

Share

మీకు క్రెడిట్ కార్డు ఉందా..? క్రెడిట్ కార్డుల ఖర్చులు తడిసి మోడవుతున్నాయా..? క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక పోతున్నారా..? అయితే ఈ చిట్కాను పాటించాండి..  రిజర్వ్ బ్యాంక్ తాజా డేటా ప్రకారం జూన్ 2021 వరకు భారతదేశంలో దాదాపు 6.5 కోట్ల క్రియాశీల క్రెడిట్ కార్డ్ ఉంది. క్రెడిట్ కార్డ్ బకాయిలు చాలా మంది కార్డు యజమానులకు పెద్ద ఆర్థిక ఆందోళన కలిగిస్తాయి. కానీ క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లు బిల్లు చెల్లింపుకు ఉపయోగపడతాయని మనలో ఎంతమందికి తెలుసు. కాబట్టి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు లేదా చెల్లించేటప్పుడు ఎల్లప్పుడూ రివార్డ్ పాయింట్‌లను గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డ్‌లతో ఒక విషయం ఖచ్చితంగా ఉంది.. మీరు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత ఎక్కువ పాయింట్లు వస్తాయి. మీకు మరిన్ని ఉచితాలు లభిస్తాయి. మనం చేసే ఖర్చుపై చాలా రివార్డ్ పాయింట్లను ఇస్తుంటాయి క్రెడిట్ కార్డు కంపెనీలు. కానీ మీరు ఎల్లప్పుడూ ఖర్చు పరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి.. లేకుంటే మీరు భారీ సమస్యల్లో ఇరుక్కుపోతారు. అంతే కాదు రివార్డ్ పాయింట్‌లను సంపాదించడానికి ఎలా ఖర్చు చేయాలి. అవసరమైన సమయంలో క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగించాలో మేము మీకు కొన్ని చిట్కాలు.. సలహాలను ఇక్కడ అందిస్తున్నాము. 

ఖర్చు ఇలా చేయండి..

రివార్డ్ పాయింట్‌లను సేకరించడానికి మీరు మొదట ఇలా వాడాలి. మీరు రివార్డ్ పాయింట్లను సేకరించిన తర్వాత కూడా  వాటిని పొందడానికి మీరు పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కంపెనీలు.. ప్లాట్‌ఫారమ్‌లలో మారుతూ ఉన్నప్పటికీ ముందుగా మీరు మీ రివార్డ్ పాయింట్‌లను ఉపయోగించడానికి కొంత మొత్తాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.  

ప్రచార ఆఫర్ల కోసం చూడండి

ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్లు నిర్దిష్ట ప్రమోషన్లను అందిస్తుంటారు. మీరు వారి కార్డుల ద్వారా కనీస ఖర్చు అవసరాలను తీర్చినట్లయితే అదనపు రివార్డ్ పాయింట్లను సంపాదించడానికి  ప్రమోషన్లను ఇస్తుంటారు. రివార్డ్ పాయింట్‌లు, అదనపు క్యాష్ బ్యాక్‌లతో పాటు ఈ ప్రమోషన్ డీల్స్‌లో కూడా మీరు గెలుచుకోవచ్చు.

సరైన కార్డును ఉపయోగించండి..

మీరు కాలక్రమేణా ఎక్కువ పాయింట్లను స్కోర్ చేయాలనుకుంటే సరైన రకం క్రెడిట్ కార్డులను ఎంచుకోవల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ కొనుగోళ్లకు అనుగుణమైన ఆఫర్ చేసే కార్డ్‌ల ఎంచుకోండి. మీరు కిరాణా కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్ అందించే క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డును కలిగి ఉంటే.. మీరు కిరాణా దుకాణం లేదా ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫారమ్ నుండి కొనుగోలు చేయాలనుకుంటే ఆ క్రెడిట్ కార్డును ఉపయోగించడం మంచిది. అదేవిధంగా మీరు ఎక్కువ శాతం జర్నీ చేస్తున్నట్లైతే ఇలాంటి సమయంలో ప్రయాణాలపై పాయిట్లు.. డిస్కౌంట్లు ఇచ్చే కార్డులను ఎంచుకోవాలి.  

చాలా ఆఫర్లను ఇలా పొందండి..

మీరు కొన్నిసార్లు ఒక లావాదేవీపై అందించే అధిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ క్రెడిట్ కార్డ్‌తో రివార్డ్‌లను పొందుతున్నప్పుడు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోండి. మీరు కొంత డిస్కౌంట్‌లు లేదా అదనపు క్యాష్‌బ్యాక్‌లను కూడా పొందవచ్చు. తద్వారా మీరు ఒక లావాదేవీ నుండి డబుల్ ప్రయోజనం పొందుతారు.

ఉదాహరణకు కొనుగోలు చేసేటప్పుడు మీ కార్డును ఉపయోగించినప్పుడు రివార్డ్‌లు కాకుండా అదనపు క్యాష్‌బ్యాక్‌లు అందించబడుతున్నాయా అని మీరు చెక్ చేసుకోవచ్చు.

వీరితో జాగ్రత్తగా ఉండండి

క్రెడిట్ కార్డుల ద్వారా అధికంగా ఖర్చు చేయడం వల్ల మీరు మరింత ఇబ్బందుల్లో పడే చాన్స్ ఉంది. ఎల్లప్పుడూ వ్యయంపై ద్యాస ఉంచండి. మీ రివార్డ్ పాయింట్ స్థితిని తనిఖీ చేయడం.. కార్డు బకాయిలు చెల్లించేటప్పుడు దాన్ని ఉపయోగించడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కష్టపడి సంపాదించిన రివార్డ్ పాయింట్లు తగ్గకుండా జాగ్రత్తపడండి. 

ఇవి కూడా చదవండి:  రిస్క్ తక్కువ.. లాభాలు ఎక్కువ.. మార్కెట్‌లో కొత్తవారికి ఇండెక్స్ ఫండ్స్‌తో మంచి రాబడి..

Amazing video: డ్రైవింగ్ అవార్డు ఇస్తేగిస్తే మనోడికే ఇవ్వాలి.. ఆ నడపడం చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే