Delta Plus Variant: వ్యాక్సిన్ వేయించుకున్నా డెల్టా వేరియంట్ కాటేస్తోంది.. మహారాష్ట్రలో గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి..

Covid-19 Delta Plus Variant: మహారాష్ట్రలో కరోనావైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ విజ‌ృంభిస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. నిన్న ఒకరు డెల్టా ప్లస్

Delta Plus Variant: వ్యాక్సిన్ వేయించుకున్నా డెల్టా వేరియంట్ కాటేస్తోంది.. మహారాష్ట్రలో గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి..
Delta Plus Variant
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 13, 2021 | 12:37 PM

Covid-19 Delta Plus Variant: మహారాష్ట్రలో కరోనావైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ విజ‌ృంభిస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. నిన్న ఒకరు డెల్టా ప్లస్ వేరియంట్‌తో మరణించగా.. తాజాగా మరొకరు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే.. వీరిద్దరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్‌తో మూడు మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం ముంబైలో నగరంలో కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఓ 63 ఏళ్ల మహిళ మరణించగా.. శుక్రవారం రాయగడ్ జిల్లాలో 69 ఏళ్ల వ్యక్తి మరణించాడు.

కాగా.. ముంబై నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ జులై 27వతేదీన డెల్టా ప్లస్ వేరియంట్‌కు గురై మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆ మహిళకు రెండు డోసుల టీకాలు వేసినా వైరస్ సోకిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. మృతురాలికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకున్నా డెల్టా ప్లస్ వేరియంట్ సోకి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడిందని వైద్యులు పేర్కొన్నారు. అయితే.. మహిళ కుటుంబంలోని ఆరుగురు కుటుంబసభ్యులు కూడా కోవిడ్ బారిన పడ్డారని.. వారిలో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు.

శుక్రవారం డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా రాయగఢ్ జిల్లాలోని నాగోథనే ప్రాంతంలో 69 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు రాయగఢ్ కలెక్టర్ నిధి చౌదరి పేర్కొన్నారు. కాగా.. మహారాష్ట్రలో మొదటగా.. రత్నగిరి జిల్లాకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు డెల్టా ప్లస్ వేరియంట్‌కు గురై మరణించింది. ఇప్పటివరకు కరోనాలోని డెల్టా బారిన పడి ముగ్గురు మరణించారు. ఇదిలాఉంటే.. మహారాష్ట్రలో మొత్తం 65 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబై నగరంలోని 11 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.

Also Read:

Covid-19 India: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. గత 24 గంటల్లో భారీగా పెరిగిన మరణాలు..

Covid 19: రానున్న రోజుల్లో కరోనా సాధారణ జలుబులా మారనుందా..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోధకులు.

మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం