AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: రానున్న రోజుల్లో కరోనా సాధారణ జలుబులా మారనుందా..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోధకులు.

Covid 19: కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న దేశాలు సైతం కరోనా దాటికి చితికిపోయాయి. ఆక్సిజన్‌ అందక ఎంతో మంది మరణించారు. రెండు వేవ్‌ల రూపంలో విళయతాండవం...

Covid 19: రానున్న రోజుల్లో కరోనా సాధారణ జలుబులా మారనుందా..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోధకులు.
Corona
Narender Vaitla
|

Updated on: Aug 13, 2021 | 11:17 AM

Share

Covid 19: కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న దేశాలు సైతం కరోనా దాటికి చితికిపోయాయి. ఆక్సిజన్‌ అందక ఎంతో మంది మరణించారు. రెండు వేవ్‌ల రూపంలో విళయతాండవం చేసిన కరోనా ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా మరణ మృదగం సృష్టించిన కరోనా మహమ్మారి రానున్న రోజుల్లో ఓ సాధారణ జలుబులా మారుతుందంటే మీరు నమ్ముతారా? కానీ పరిశోధకులు మాత్రం ఇదే విషయాన్ని చెబుతున్నారు. మానవులు నిజంగానే కరోనాతో సావాసం చేసే రోజులు వస్తాయని తేల్చి చెబుతున్నారు. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు.

తాజా పరిశోధన ప్రకారం ఇప్పటి వరకు కరోనా బారిన పడని చిన్నారులకు భవిష్యత్తులో కరోనా వ్యాధి ఓ సాధారణ జలుబుగా మారుతుందని తేలింది. పెనిస్లేవియా స్టేట్‌ యూనివర్సిటీ బయాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒట్టార్ జార్న్‌స్టాడ్ ఈ విషయమై పలు ఆసక్తికర నిజాలను బయటపెట్టారు. దీనిపై ఒట్టార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం పెద్ద వారిలో చాలా మంది వరకు వ్యాక్సినేషన్‌ చేసుకోవడం లేదా సహజంగా రోగ నిరోధక శక్తి పెరిగింది కాబట్టి వైరస్‌ ముప్పు చిన్నారులకే ఎక్కువగా పొంచి ఉందన్నారు. మరికొన్నేళ్లలో చిన్నారుల్లో కరోనా వ్యాధి సాధారణ జలుబులా మారిపోనుంది. చరిత్రలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలే దీనికి ఉదాహరణ చెప్పవచ్చని తెలిపిన బట్టార్‌ దీనికి రష్యాన్‌ ఫ్ల్యూను ఉదాహరణగా చెప్పారు. ‘1889-1890 మధ్యలో విజృంభించిన రష్యాన్‌ ఫ్లూ కారణంగా సుమారు 10 లక్షల మంది మరణించారు. ఈ వ్యాధి ఎక్కువగా 70 ఏళ్లు పైబడిన వారికి సోకింది. కాలానుగుణంగా కనుమరుగైన ఈ వైరస్‌ ప్రస్తుతం 7 నుంచి 12 ఏళ్ల చిన్నారుల్లో జలుబుకు కారణంగా మారుతుంది. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌తో పాటు పలు కరోనా వైరస్‌లు కూడా కాలంతోపాటు మార్పులు చెందాయ’ని చెప్పుకొచ్చారు.

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ‘రియలస్టిక్‌ ఏజ్‌ స్ట్రక్చర్డ్ (ఆర్‌ఏఎస్‌)’ అనే గణిత కోడ్‌ను రూపొందించారు. పలు దేశాల్లో 1, 10, 20 ఏళ్లలో వైరస్‌ మార్పు చెందిన విధానాన్ని పరిశోధకులు గుర్తించారు. జనాభాలో వ్యత్యాసం, అక్కడి బౌగోళిక పరిస్థితుల్లో తేడాల కారణంగా ఇందులో పలు మార్పులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో విజృంభించిన పలు వైరస్‌ల కారణంగా వయసు పైబడిన జనాభా ఉన్న దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామ’ని ఓస్లో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ స్టెన్‌సేత్ తెలిపారు.

Also Read: Joker Robbery: హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీకి ప్లాన్.. పోలీసులకు ఛాలెంజ్ విసిరిన జోకర్ దొంగ.. వీడియో వైరల్..

Share Market: రాకెట్ వేగంతో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. 55 వేల స్థాయిని దాటి.. ఆల్ టైమ్ రికార్డుకు సెన్సెక్స్

Boycott RadhikaApte: రాధికా ఆప్టేను బహిష్కరించాలంటోన్న నెటిజన్లు. ట్రెండింగ్‌లో బైకాట్‌ రాధికా.. కారణమేంటో తెలుసా?