Boycott RadhikaApte: రాధికా ఆప్టేను బహిష్కరించాలంటోన్న నెటిజన్లు. ట్రెండింగ్‌లో బైకాట్‌ రాధికా.. కారణమేంటో తెలుసా?

Boycott RadhikaApte: నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో బాలీవుడ్‌ బ్యూటీ రాధికా ఆప్టే ఒకరు. సినిమాల్లో గ్లామర్‌ డోస్‌ పెంచినా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అది రాధికాకే దక్కింది. నిత్యం వార్తల్లో నిలుస్తూ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ చేసే రాధికా ఆప్టే...

Boycott RadhikaApte: రాధికా ఆప్టేను బహిష్కరించాలంటోన్న నెటిజన్లు. ట్రెండింగ్‌లో బైకాట్‌ రాధికా.. కారణమేంటో తెలుసా?
Radhika Apte
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 13, 2021 | 10:40 AM

Boycott RadhikaApte: నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో బాలీవుడ్‌ బ్యూటీ రాధికా ఆప్టే ఒకరు. సినిమాల్లో గ్లామర్‌ డోస్‌ పెంచినా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అది రాధికాకే దక్కింది. నిత్యం వార్తల్లో నిలుస్తూ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ చేసే రాధికా ఆప్టే మరోసారి వార్తల్లోకెక్కారు. అయితే ఈసారి దానికి కారణం ఆమె చేసిన వ్యాఖ్యలు, సినిమాలు కాదు. రాధికాపై నెటిజన్లు విరుచుకుపడడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ విషయంపై రాధికా ఎందుకు స్పందించడం లేదంటూ ట్విట్టర్‌ యూజర్స్‌ మండిపడుతున్నారు. ఏకంగా ‘బైకాట్‌ రాధికా ఆప్టే’ అనే హాష్‌ ట్యాగ్‌ను వైరల్‌ చేస్తున్నారు. ఇంతకీ రాధికను ఎందుకు అంతలా విమర్శిస్తున్నారనేగా అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

వివారాల్లోకి వెళితే.. ప్రస్తుతం బాలీవుడ్‌లో శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ‘పోర్నోగ్రఫీ’ అంశం ఎంతలా హాట్‌ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజ్‌కుంద్రా చట్ట విరుద్ధంగా పోర్న్‌ వీడియోలను చిత్రీకరించారాని, కొందరు నటీమణులతో బలవంతంగా వీడియోలు తీయించారన్న అభియోగాలతో పోలీసులు విచారణ చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ అంశం అటు తిరిగి, ఇటు తిరిగి నటి రాధిక ఆప్టే మెడకు చిక్కుకుంది. నెటిజన్ల వాదన ప్రకారం.. గతంలో ‘మీ టూ’ లాంటి సంఘటనలు జరిగినప్పుడు బహిరంగంగా స్పందించిన నటీమణులు రాజ్‌ కుంద్రా విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. రాధిక ఆప్టేతో పాటు మరికొంత మంది తారలపై విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే రాధికకు సంబంధించి #BoycottRadhikaApte ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. రాధిక గతంలో నటించిన కొన్ని గ్లామర్‌ పాత్రలను తప్పుపడుతూ ట్వీట్‌లు చేస్తున్నారు. మరి నెట్టింట జరుగుతోన్న ఈ రచ్చపై రాధికా ఎలా స్పందిస్తారో చూడాలి.

నెట్టింట వైరల్ అవుతోన్న కొన్ని ట్వీట్స్..

Also Read: Sonakshi Chiranjeevi: చిరు సినిమా కోసం సోనాక్షి అంత డిమాండ్‌ చేస్తోందా.. కండిషన్స్‌కు షాక్ అవుతోన్న ప్రొడ్యూసర్స్‌?

KGF 2: రాక్‏స్టార్ సినిమాకు భారీగా డిమాండ్.. కేజీఎఫ్2కు ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసిన ఓటీటీ ?

Mahesh Babu : సర్కారు వారి పాట సెట్‌‌‌‌లో పుష్ప దర్శకుడు.. మహేష్-సుకుమార్ మీటింగ్ కు కారణం అదేనా..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..