AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonakshi Chiranjeevi: చిరు సినిమా కోసం సోనాక్షి అంత డిమాండ్‌ చేస్తోందా.. కండిషన్స్‌కు షాక్ అవుతోన్న ప్రొడ్యూసర్స్‌?

Sonakshi Chiranjeevi: 'సైరా నర్సింహా రెడ్డి' సినిమాత తర్వాత కాస్త గ్యాప్‌ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ లోటును తీర్చేందుకు గాను వరుస సినిమాలకు సైన్‌ చేసి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న...

Sonakshi Chiranjeevi: చిరు సినిమా కోసం సోనాక్షి అంత డిమాండ్‌ చేస్తోందా.. కండిషన్స్‌కు షాక్ అవుతోన్న ప్రొడ్యూసర్స్‌?
Sonakshi Ciranjeevi
Narender Vaitla
|

Updated on: Aug 13, 2021 | 10:00 AM

Share

Sonakshi Chiranjeevi: ‘సైరా నర్సింహా రెడ్డి’ సినిమాత తర్వాత కాస్త గ్యాప్‌ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ లోటును తీర్చేందుకు గాను వరుస సినిమాలకు సైన్‌ చేసి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంతో బిజీగా ఉన్న చిరు. ఈ సినిమా పూర్తికాగానే బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం విధితమే. ఈ చిత్రంలో చిరుకు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తోందని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్ర యూనిట్‌ నుంచి మాత్రం ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో సోనాక్షి రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ సినిమా కోసం సోనాక్షి ఏకంగా రూ. 4 కోట్లు డిమాండ్‌ చేసిందనేది సదరు వార్త సారాంశం. కేవలం ఈ రెమ్యునరేషన్‌ కాకుండా హోటల్‌, తనతో పాటు వచ్చే వారికి కూడా వేతనం నిర్మాతే ఇవ్వాలని సోనాక్షి కండిషన్‌ పెట్టిందని తెలుస్తోంది. దీంతో చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్‌ సోనాక్షి విషయంలో సందిగ్ధంలో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి సోనాక్షి నిజంగానే అంతలా డిమాండ్‌ చేసిందా.? లేదా అన్న దానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటనవ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే గతంలో రజినీకాంత్‌ సరసన నటించిన ‘లింగ’ సినిమా కోసం సోనాక్షి ఇలాంటి కండిషన్స్‌ పెట్టిందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అన్ని చిత్రాలు పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతుండడంతోనే ఇలా బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లను సినిమాలో ఉండేలా చూసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేసన్‌లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న కియారా అద్వానీ కూడా భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా.. బాలీవుడ్‌ భామలు తెలుగులో నటించాలంటే భారీగానే ముట్టజెప్పుకోవాలన్న వాదనకు బలం చేకూర్చినట్లవుతోంది.

Also Read: Lucifer Remake: ఎట్టకేలకు సెట్స్ పైకి ‘లూసిఫర్’ మూవీ.. యాక్షన్ షూరు చేసామంటూ డైరెక్టర్ ట్వీట్..

KGF 2: రాక్‏స్టార్ సినిమాకు భారీగా డిమాండ్.. కేజీఎఫ్2కు ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసిన ఓటీటీ ?

18 Pages: డబ్బింగ్ మొదలుపెట్టిన యంగ్ హీరో.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ’18 పేజెస్’