AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2: రాక్‏స్టార్ సినిమాకు భారీగా డిమాండ్.. కేజీఎఫ్2కు ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసిన ఓటీటీ ?

కన్నడ రాక్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో... ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కేజీఎఫ్ 2. సినీ పరిశ్రమలోనే సంచలనం సృష్టించిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా

KGF 2: రాక్‏స్టార్ సినిమాకు భారీగా డిమాండ్.. కేజీఎఫ్2కు  ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసిన ఓటీటీ ?
Kgf 2
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2021 | 8:40 AM

Share

కన్నడ రాక్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో… ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కేజీఎఫ్ 2. సినీ పరిశ్రమలోనే సంచలనం సృష్టించిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు ప్రశాంత్ నీల్. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కేజీఎఫ్ మూవీకి సిక్వెల్‏గా రాబోతున్న కేజీఎఫ్ 2 పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‏కు రెస్పాన్స్ మాములుగా రాలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో్ చక్కర్లు కొడుతుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ కేజీఎఫ్ 2 మూవీకి డిజిటల్ రైట్స్ కోసం భారీగా ఆఫర్ చేసిందట. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీ రిలీజ్ చేస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఎక్కువ మొత్తంలో ఇవ్వనున్నట్లుగా ఆఫర్ చేసిందట. కానీ మేకర్స్ ఈ డీల్ అంగీకరించలేదని.. ఫస్ట్ పార్ట్ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని థియేటర్లలోనే ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల చేయబోతుండడంతో అనువైన తేదీల గురించి ఆలోచిస్తున్నారట మేకర్స్. ఇందులో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‏గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు కీలక పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రుర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు.

Also Read: Krishna Vamsi: ఈ క్రియేటివ్ డైరెక్టర్ కొత్త సినిమా ఆ హీరోతోనేనా.. ఫిలిం సర్కిల్స్‌‌‌‌లో చక్కర్లు కొడుతున్న వార్త..

Mahesh Babu : సర్కారు వారి పాట సెట్‌‌‌‌లో పుష్ప దర్శకుడు.. మహేష్-సుకుమార్ మీటింగ్ కు కారణం అదేనా..

18 Pages: డబ్బింగ్ మొదలుపెట్టిన యంగ్ హీరో.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ’18 పేజెస్’

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు