Krishna Vamsi: ఈ క్రియేటివ్ డైరెక్టర్ కొత్త సినిమా ఆ హీరోతోనేనా.. ఫిలిం సర్కిల్స్‌‌‌‌లో చక్కర్లు కొడుతున్న వార్త..

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ త్వరలో రంగమార్తాండ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విభిన్నమైన కథతో ఈ సినిమాను..

Krishna Vamsi: ఈ క్రియేటివ్ డైరెక్టర్ కొత్త సినిమా ఆ హీరోతోనేనా.. ఫిలిం సర్కిల్స్‌‌‌‌లో చక్కర్లు కొడుతున్న వార్త..
Krishna Vamshi
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 13, 2021 | 8:15 AM

Krishna Vamsi: టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ త్వరలో రంగమార్తాండ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కృష్ణ వంశీ. ఇదిలా ఉంటే ఈ క్రియేటివ్ డైరెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని  వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. సోషల్ మెసేజ్‌‌‌‌తో గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ కథను ఎన్టీఆర్ కోసం సిద్ధం చేశారట కృష్ణవంశీ. వ్యవసాయం.. రైతుల సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ముందు నటసింహం బాలకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను చేయాలని అనుకున్నారు. ఈ సినిమాకు రైతు అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. నిజానికి బాలకృష్ణ 100సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించాలని చూసారు కృష్ణవంశీ. ఇప్పుడు ఆ కథను ఎన్టీఆర్‌‌‌తో చేయాలనే పట్టుదలతో కృష్ణవంశీ  ఉన్నారని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌‌‌‌లో ఈ సినిమా షూటింగ్ చిత్రికరిస్తున్నారు. ఈ మూవీలో తారక్ కొమురం భీమ్‌‌‌‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు తారక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..!

Samantha: మునుపెన్నడూ చేయని పాత్రలో సమంత..!! శాకుంతలం మూవీపై భారీ అంచనాలు.. వీడియో

Upasana Konidela: RRR సెట్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. మూవీ టీం చూపించిన కేరింగ్‌కు ఫిదా