Upasana Konidela: RRR సెట్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. మూవీ టీం చూపించిన కేరింగ్‌కు ఫిదా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో సందడి చేశారు. ఉక్రెయిన్ షెడ్యూల్ కోసం చెర్రీతో కలిసి వెళ్లిన ఉపాసన..

Upasana Konidela: RRR సెట్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. మూవీ టీం చూపించిన కేరింగ్‌కు ఫిదా
Upasana Ram Charan
Follow us
Ram Naramaneni

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 13, 2021 | 2:06 AM

Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో సందడి చేశారు. ఉక్రెయిన్ షెడ్యూల్ కోసం చెర్రీతో కలిసి వెళ్లిన ఉపాసన.. తాజాగా సెట్స్‌లో మెరిశారు. షూటింగ్ వీక్షిస్తూ సరదాగా గడిపారు. ఇక ఉక్రెయిన్ అందాలను, అక్కడి వీధుల్లో విహరిస్తూ  ఆనందించారు. ఈ మేరకు ఉపాసన షేర్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక రాజమౌళి ఫ్యామిలీతో ఉపాసన బాగా దగ్గరయినట్లు అర్ధమవుతుంది. కాగా గతంలోనూ చెర్రీతో పాటు సెట్స్ మీదకు ఉపాసన వెళ్లారు. వినయ విధేయ రామ చిత్రీకరణ సమయంలో చరణ్ కోసం స్పెషల్‌గా వండి పెట్టేవారు. అప్పుడు చెర్రీ డైట్‌కు సంబంధించిన విషయాలను దగ్గరుండి మరీ చూసుకున్నారు. తాజాగా ఉపాసన ఇప్పుడు ఉక్రెయిన్‌లో చెర్రీ పక్కనే ఉంటూ సందడి చేశారు. అయితే ఉపాసన తిరిగి హైదరాబాద్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇంకొన్ని రోజులు ఉన్నా కూడా.. వివిధ పనుల కారణంగా ఆమె సిటీకి రానున్నట్లు సమాచారం. అయితే ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తనను చూసుకున్న విధానం, కేరింగ్‌కు ఆమె ఫిదా అయినట్లు ఆమె చేసిన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఈ మేరకు రాజమౌళి ఫ్యామిలీకి  థ్యాంక్స్ చెప్పిన ఉపాసన.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ మంచిగా చేసుకుని రండి అని తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. తర్వలో హైదరాబాద్‌లో  కలుసుకుందామని పేర్కొన్నారు.

Also Read:ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క లిక్కర్ బాటిల్ తెచ్చేందుకు కూడా అనుమతి లేదు.. ఏపీ సర్కార్ క్లారిటీ

ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్‌పై ట్విస్ట్… హైకోర్టుకు వెళ్లిన వ్యవహారం