Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘లూసీఫర్‌’ సినిమాను తెలుగులోకి రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్నాళ్ల నుంచో ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది.

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..!
Chiranjeevi
Follow us
Venkata Chari

|

Updated on: Aug 12, 2021 | 9:03 PM

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘లూసీఫర్‌’ సినిమాను తెలుగులోకి రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్నాళ్ల నుంచో ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రారభిస్తున్నట్లు వార్తలు వెలువడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నెల 13 నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను కూడా వేస్తున్నారంట. ఈ సెట్‌లోనే తొలి షెడ్యూల్‌ ప్రారంభం కానుందంట. ఈ సినిమా విభిన్నమైన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో పాత్ర కోసం చిరంజీవి బరువు తగ్గాడు. ఈ మధ్య విడుదలైన చిరు లేటెస్ట్ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 153వ సినిమాగా రానున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మోహన్‌ రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్‌తో కలిసి ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సత్యదేవ్, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు.

చిరంజీవి ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను నాలుగు లేదా ఐదు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ‘వేదాళం’ తెలుగు రీమేక్‌తోపాటు బాబీ డైరెక్షన్‌లో మల్టీ స్టారర్‌తో సహా మరో రెండు సినిమాలను పట్టాలెక్కించనున్నాడు. అలాగే ఆచార్య సినిమాలో చివరి ఎపిసోడ్ మాత్రమే పెండింగ్‌ ఉందంట. దీనిని కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారంట. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్యలో రాం చరణ్ కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Also Read: RRR సెట్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. మూవీ టీం చూపించిన కేరింగ్‌కు ఫిదా

Viral Photos: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న DDL బ్యూటీ కూతురు.. తాజాగా వైరల్‌గా మారిన తల్లితో జిమ్‌కు కలిసి వెళ్తున్న ఫోటోలు..