Nabha Natesh: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ఇస్మార్ట్‌ బ్యూటీ.. బాలీవుడ్‌ బడా హీరోకు జోడిగా నటించనున్న నభా.?

Nabha Natesh: 2015లో కన్నడ సినిమా ద్వారా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార నభా నటేష్‌. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది అనంతరం కన్నడలో పలు విజయంతమైన చిత్రాల్లో నటించింది...

Nabha Natesh: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ఇస్మార్ట్‌ బ్యూటీ.. బాలీవుడ్‌ బడా హీరోకు జోడిగా నటించనున్న నభా.?
Nabha Natesh
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 13, 2021 | 8:04 AM

Nabha Natesh: 2015లో కన్నడ సినిమా ద్వారా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార నభా నటేష్‌. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది అనంతరం కన్నడలో పలు విజయంతమైన చిత్రాల్లో నటించింది. ఇక 2018లో ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయయమైంది. ఇక పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. ఈ సినిమాలో తెలంగాణ యాసలో నభా పలికిన మాస్‌ డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. అయితే ఈ సినిమా తర్వాత నభా మళ్లీ ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

అయితే విజయం సొంతం చేసుకోకపోయినా ఆఫర్లు మాత్రం క్యూ కడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు తాజాగా మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ది నైట్‌ మేనేజర్‌ అనే టీవీ సిరీస్‌ను బాలీవుడ్‌ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరగుతున్నాయి. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సిరీస్‌ను తెరకెక్కించే పనిలో పడింది. ఇక ఈ సిరీస్‌లో బాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన హృతిక్‌రోషన్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్‌కు జోడిగా నభా నటేష్‌ నటించనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లిష్‌ మీడియాలో ఈ వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే నభా దిశ మారినట్లే. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ బాట పట్టిన అతికొద్ది మంది హీరోయిన్లలో నభా చోటు దక్కించుకున్నట్లు అవుతుంది.

Nabha Hritik Roshan

 

Also Read: Laal Singh Chaddha: కాకినాడలో సందడి చేస్తున్న ఆమిర్ ఖాన్.. ఫోటోల కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్

Divi: బిగ్‌బాస్‌ బ్యూటీ దివి క్రష్‌ ఎవరో తెలుసా.? అతనితో కప్పు కాఫీ తాగినా చాలంటా.. ఇంతకీ అతనెవరంటే..

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..!