AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Movies 2021: వినాయక చవితి కానుకగా థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు

Upcoming Movies 2021: కోవిడ్ ప్రభావం అన్ని రంగాలపై పడినట్లే.. సినీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. సెకండ్ వేవ్ తర్వాత అన్ లాక్ తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. దీంతో చిన్న చిత్ర నిర్మాతలు..

Upcoming Movies 2021: వినాయక చవితి కానుకగా థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు
Telugu Moives
Surya Kala
|

Updated on: Aug 12, 2021 | 9:50 AM

Share

Upcoming Movies 2021: కోవిడ్ ప్రభావం అన్ని రంగాలపై పడినట్లే.. సినీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. సెకండ్ వేవ్ తర్వాత అన్ లాక్ తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. దీంతో చిన్న చిత్ర నిర్మాతలు దైర్యం చేసి తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎస్ఆర్ కల్యాణ మండపం వంటి సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అయితే కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ నడుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో సినిమాల ప్రదర్శనకు మూడు షోలకు అనుమతి మాత్రమే ఉండగా.. మరోవైపు తెలంగాణలో ఐదు షోలకు అనుమతినిచ్చింది.

టాక్ జగదీశ్ వంటి సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుండగా.. సెప్టెంబర్ లో వరసగా సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. వినాయక చవితి కి థియేటర్స్ లో సినిమాలు సందడి చేయడానికి మినిమమ్ బడ్జెట్ సినిమాలు రెడీ అవుతున్నాయి. నాగ చైతన్య లవ్ స్టోరీ, నాని టక్ జగదీష్, గోపీచంద్ సీటీమార్, రానా విరాట పర్వం, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, నాగ శౌర్య వరుడు కావలెను వంటి సినిమాలు వినాయక చవితి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.

అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో సెప్టెంబర్ లోనే తమ సినిమాలను రిలీజ్ చేయడానికి కొంతమంది నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరితో ఒకరు మాట్లాడుకున్న తర్వాతే విడుదల తేదీలు అనౌన్స్ చేసేలా కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత సినీ ప్రేక్షకులకు సినిమాల విందుని సెప్టెంబర్ నెల ఇవ్వనున్నదని తెలుస్తోంది.

Also Read: Flower Mask: ఓ వ్యాపారి వినూత్న ఆలోచన… బతకాలంటే మూతికి బట్టకట్టాల్సిందే అంటూ పూలతో మాస్కుల తయారీ ఎక్కడంటే9o