- Telugu News Photo gallery Viral photos Madurai Florist Makes Floral Masks For Brides and Grooms To Spread Awareness About Covid 19
Flower Mask: ఓ వ్యాపారి వినూత్న ఆలోచన… బతకాలంటే మూతికి బట్టకట్టాల్సిందే అంటూ పూలతో మాస్కుల తయారీ ఎక్కడంటే
Flower Mask: జపాన్, కొరియా వంటి దేశాల్లో ఉన్న మాస్కుల సంస్కృతి కరోనా పుణ్యమాని ప్రతి దేశాలకు వచ్చేసింది. బతికి బట్టకట్టాలంటే.. మూతికి మాస్క్ కట్టాల్సిందే అన్న పరిస్థితి ఏర్పడింది. అయితే మాస్కులు పెట్టుకుంటే.. ఒక బాధ పెట్టుకోకపోతే ఒక బాధ అన్న చందంగా ఉంది. ముఖ్యంగా పెళ్ళిలవంటి వేడుకల్లో మాస్కులు పెట్టుకోవాలంటే మరీ ఇబ్బంది.. దీంతో ఒక వ్యాపారి వింత ఆలోచన చేసి.. సరికొత్తగా పూల మాస్కులను రెడీ చేశాడు.
Updated on: Aug 12, 2021 | 9:26 AM

పెళ్లిలో మాస్క్‌ల గోల ఏంటని హైరానా పడుతున్న వారి కష్టాలు తీర్చేవిధంగా తమిళనాడుకు చెందిన పూల వ్యాపారి వింత ఆలోచన చేశాడు. పూలతో మాస్క్ లు తయారుచేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు.

పూల వ్యాపారి చాలా స్మార్ట్‌గా ఆలోచించి రకరకాల పూలతో చక్కిటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్‌లను తయారు చేశాడు.

మదురై స్వామికన్నిగైకు చెందిన పూల వ్యాపారి మోహన్.. తన బుర్రకు పదును పెట్టి.. వధూవరుల కోసం ప్రత్యేకంగా పూల మాస్కులను తయారు చేశాడు.

మూడు పొరలతో మల్లె , లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్ తయారుచేసిన పూల వ్యాపారి మోహన్

చక్కటి పరిమళాలు వెదజల్లుతూ ఉన్న పూల మాస్కులు.. ఆకట్టుకుంటున్న ఫోటోలు

పెళ్లిళ్లలో కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్కు తయారుచేశానని మోహన్ చెబుతున్నాడు. ఇప్పుడు చాలా అర్దార్లు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

ఓ వైపు వ్యాపారం, మరోవైపు కరోనాపై అవగాహన పెంచడానికి తమ వంతు కృషి చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మోహన్ చెబుతున్నాడు. పూల మాస్కులు ధరించిన వధూవరుల ఫోటోలు జీవిత కాలం జ్ఞాపకంగా ఉంటాయని చెబుతున్నాడు.




