Divi: బిగ్‌బాస్ బ్యూటీ దివి క్రష్ ఎవరో తెలుసా.? అతనితో కప్పు కాఫీ తాగినా చాలంటా.. ఇంతకీ అతనెవరంటే..
Bigboss Fame Divi: దివి వైద్య.. ఇప్పుడీ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ పేరు ఒక్కసారిగా మారుమోగింది. అప్పటి వరకు పెద్దగా ఎవరికీ పరిచయం లేని దివి.. బిగ్‌బాస్ రియాలిటీ షో తర్వాత...
Bigboss Fame Divi: దివి వైద్య.. ఇప్పుడీ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ పేరు ఒక్కసారిగా మారుమోగింది. అప్పటి వరకు పెద్దగా ఎవరికీ పరిచయం లేని దివి.. బిగ్‌బాస్ రియాలిటీ షో తర్వాత అందరి నోళ్లలోనూ నానింది. అంతకు ముందు పలు చిత్రాల్లో తళుక్కుమన్నప్పకిటీ బిగ్‌బాస్ షో దివికి ఎక్కడలేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. బిగ్‌బాస్ హౌజ్‌లో తనదైన అందం, ఆటతో ఆకట్టుకున్న చిన్న బుల్లి తెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. షో నుంచి బయటకు రాకముందే పలు సినిమాల ఛాన్స్‌లను సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తూ బిజీబిజీగా గడుపుతోందీ చిన్నది. ఈ క్రమంలోనే దివిని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా సంస్థలతో పాటు, పలు యూట్యూబ్ ఛానళ్లు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూబ్యూట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కుర్రాళ్లకు క్రష్‌గా మారిన దివికి క్రష్ ఎవరనే ప్రశ్నకు స్పందించిన ఈ సొట్టబుగ్గల చిన్నది. తనకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్‌పై క్రష్ అని ఓపెన్ అయిపోయింది. మిర్చి సినిమాతో ప్రభాస్‌కు ఫ్యాన్ అయిపోయానని చెప్పిన దివి.. అప్పటి నుంచి ఆయనకు ‘ఐ లవ్ యూ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తుండేదాన్నని తెలిపింది. ఒకవేళ అవకాశం వస్తే ప్రభాస్‌తో డేటింగ్‌కు కూడా వెళ్తానని, ప్రభాస్‌తో కప్పు కాఫీ తాగినా చాలని ప్రభాస్‌పై ఉన్న ఇష్టాన్ని బహిరంగంగానే బయటపెట్టిందీ బ్యూటీ. ఇక దివి ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాతో పాటు పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
Upasana Konidela: RRR సెట్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. మూవీ టీం చూపించిన కేరింగ్‌కు ఫిదా