Mahesh Babu : సర్కారు వారి పాట సెట్‌‌‌‌లో పుష్ప దర్శకుడు.. మహేష్-సుకుమార్ మీటింగ్ కు కారణం అదేనా..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తతం పరశు రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా..

Mahesh Babu : సర్కారు వారి పాట సెట్‌‌‌‌లో పుష్ప దర్శకుడు.. మహేష్-సుకుమార్ మీటింగ్ కు కారణం అదేనా..
Mahesh
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 13, 2021 | 8:15 AM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తతం పరశు రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమాలో మహేష్ న్యూ లుక్‌‌‌లో కనిపించనున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీలో మహేష్‌‌‌కు జోడీగా కీర్తిసురేష్ నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్‌‌‌లో సడన్‌‌‌గా ప్రత్యక్షం అయ్యారు డైరెక్టర్ సుకుమార్. తాజాగా మహేష్ – సుక్కూ కలిసి సెట్స్‌‌‌లో ముచ్చటిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఇద్దరు కలవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్‌‌‌తో సుకుమార్ సినిమా చేయబోతున్నారా అన్న డౌట్ చాలా మందికి వస్తుంది. మహేష్ బాబు – డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ‘1-నేనొక్కడినే’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ  సినిమా తర్వాత మహేష్‌‌‌తో మరో సినిమా చేయాలని సుకుమార్ భావించిట్టూ.. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎదో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆ సినిమా క్యాన్సిల్ అయిందని వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమా పాటను మహేష్ లాంచ్ చేశారు. అలాగే ఈ మధ్య సుకుమార్ ఇంట జరిగిన ఓ ఫంక్షన్‌‌‌కు మహేష్ హాజరయ్యారు. ఇక ఇప్పుడు  సుకుమార్ మహేష్‌‌‌ను మీట్ అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌‌‌గా మారింది. అయితే వీరిద్దరూ ఓ కమర్షియల్ యాడ్ కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌‌‌లో ఈ యాడ్ షూటింగ్ జరుగనుందని అంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ – సుకుమార్ ఇద్దరూ ఒకరితో ఒకరు చాలా సేపు మాట్లాడుకున్నారని టాక్. ప్రస్తుతం మహేష్ బాబు – సుకుమార్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..!

Samantha: మునుపెన్నడూ చేయని పాత్రలో సమంత..!! శాకుంతలం మూవీపై భారీ అంచనాలు.. వీడియో

Upasana Konidela: RRR సెట్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. మూవీ టీం చూపించిన కేరింగ్‌కు ఫిదా

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?