Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucifer Remake: ఎట్టకేలకు సెట్స్ పైకి ‘లూసిఫర్’ మూవీ.. యాక్షన్ షూరు చేసామంటూ డైరెక్టర్ ట్వీట్..

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‏లో జోరు పెంచారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరు. ఈ సినిమా తర్వాత అటు

Lucifer Remake: ఎట్టకేలకు సెట్స్ పైకి 'లూసిఫర్' మూవీ.. యాక్షన్ షూరు చేసామంటూ డైరెక్టర్ ట్వీట్..
Chiru
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 13, 2021 | 9:36 AM

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‏లో జోరు పెంచారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరు. ఈ సినిమా తర్వాత అటు మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ చిత్రాన్ని రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించనుండగా.. చిరు కెరీర్‏లో 153వ మూవీగా రాబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ ఈరోజు (ఆగస్ట్ 13న) ప్రారంభమైంది.

ఈరోజు ఉదయం ఈ సినిమాకు సంబంధించిన ఓసాలిడ్ యాక్షన్ సీన్ చిత్రీకరించినట్లుగా దర్శకుడు మోహన్ రాజా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. షూటింగ్ లోకెషన్‍లో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ రాజన్, స్టంట్ మాస్టర్ సిల్వతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ షూటింగ్ స్టార్ట్ అయినట్లుగా కన్ఫార్మ్ చేశాడు మోహన్ రాజా. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్వీఆర్ సినిమా సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఆర్.బి. చౌదరి- ఎన్.వి.ప్రసాద్ – పరాస్ జైన్, వాకాడ అప్పారావ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ట్వీట్..

ఇక ఆచార్య సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. ఇందులో చిరుకు జోడిగా కాజల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Also Read: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. సింగర్ కూడా.. గుర్తుపట్టండి..

KGF 2: రాక్‏స్టార్ సినిమాకు భారీగా డిమాండ్.. కేజీఎఫ్2కు ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసిన ఓటీటీ ?

Mahesh Babu : సర్కారు వారి పాట సెట్‌‌‌‌లో పుష్ప దర్శకుడు.. మహేష్-సుకుమార్ మీటింగ్ కు కారణం అదేనా..