Share Market: రాకెట్ వేగంతో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. 55 వేల స్థాయిని దాటి.. ఆల్ టైమ్ రికార్డుకు సెన్సెక్స్

శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. కొనుగోళ్ల అండతో మరింత జోష్‌లో దూకుడుమీదున్నాయి. దీంతో ఈ ఉదయం ప్రారంభం నుంచి బుల్ రన్ కొనసాగింది.

Share Market: రాకెట్ వేగంతో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. 55 వేల స్థాయిని దాటి.. ఆల్ టైమ్ రికార్డుకు సెన్సెక్స్
Sensex Bull Run
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 13, 2021 | 11:05 AM

శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. కొనుగోళ్ల అండతో మరింత జోష్‌లో దూకుడుమీదున్నాయి. దీంతో ఈ ఉదయం ప్రారంభం నుంచి బుల్ రన్ కొనసాగింది. మార్కెట్లు భారీ లాభాలతో మెరిసి పోయాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఏకంగా 55,060 పాయింట్లతో ఆల్ టైమ్ రికార్డును టచ్‌ చేసింది. శుక్రవారం ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 224 పాయింట్లు లాభపడి 55,068 వద్ద.. నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 16,435 వద్ద కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా పెట్రోస్టాక్స్‌తో పాటు ఆటోమోబైల్‌, మెటల్‌ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఫార్మాషేర్లు నష్టాల‍్లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.27 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. పవర్‌ గ్రిడ్‌, డాక్టర్ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Gupta Nidhulu: గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్.. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏం జరిగేదో..

Horoscope Today: ఈరాశుల వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..