Tourism Awards: కేంద్ర పర్యాటక అవార్డులు.. టూరిజంలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించున్న తెలుగు రాష్ట్రాలు

Tourism Awards: టూరిజం అవార్డుల్లో తెలుగు స్టేట్స్‌ సత్తా చాటాయి. జాతీయస్థాయిలో ఏపీ, తెలంగాణ ముందు వరుసలో నిలిచాయి. ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో..

Tourism Awards: కేంద్ర పర్యాటక అవార్డులు.. టూరిజంలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించున్న తెలుగు రాష్ట్రాలు
Ap, Telangana
Follow us

|

Updated on: Sep 28, 2022 | 7:03 AM

Tourism Awards: టూరిజం అవార్డుల్లో తెలుగు స్టేట్స్‌ సత్తా చాటాయి. జాతీయస్థాయిలో ఏపీ, తెలంగాణ ముందు వరుసలో నిలిచాయి. ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఉత్తమ క్రీడా పర్యాటకం కింద గోల్ఫ్‌ విభాగంలో మొదటి స్థానం దక్కించుకుంది తెలంగాణ. ఇక, ఆంధ్రప్రదేశ్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డును కైవసం చేసుకుంది. టూరిజం డెవలప్‌మెంట్‌లో ఈ అవార్డును అందుకుంది ఏపీ. అనేక విభాగాల్లో జాతీయస్థాయిలో సత్తా చాటింది ఆంధ్రప్రదేశ్‌. ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ టూరిజం అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు రాష్ట్రాలు ఈ పురస్కారాలను అందుకున్నాయి. ఇదిలాఉంటే, పర్యాటకరంగం అభివృద్ధి కోసం విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో క్యాంపెయిన్‌ ప్రారంభించింది ఏపీ టూరిజం. అయితే జియో పోర్టల్‌ ఆధారంగా రూపొందించిన వెబ్‌పోర్టల్‌ను క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం, వైవిధ్య ఉత్సవాల బ్రోచర్లను ఆవిష్కరించారు. అలాగే వచ్చే ఏడాదిని విజట్‌ ఆంధ్రప్రదేశ్‌-2023గా ప్రకటించారు ముఖ్యమంత్రి. ఏపీలో పర్యాటక ప్రదేశాలను సులువుగా గుర్తించేలా జీఐఎస్‌ వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. టూరిజం, ట్రావెల్‌, హాస్పిటాలిటీ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చాలని టూరిజంశాఖ ఉన్నతాధికారులకు సూచించారు సీఎం జగన్‌.

అయితే కేంద్ర టూరిజం అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలు హవా కొనసాగిస్తున్నాయి. ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలువడం హర్షం వ్యక్తం అవుతోంది. ఇందులో బెస్ట్‌ టూరిజం ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌ ఉండగా, విదేశీ భాషలో ఏపీ కాఫీ టేబుల్‌ బుక్‌కు అవార్డు దక్కినందుకు ఆ రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయవాడ ది గేట్‌ వే హోటల్‌కు బెస్ట్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌గా అవార్డు లభించింది. బెస్ట్ టూరిజం గోల్ఫ్ కోర్సుగా హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌కు అవార్డు దక్కింది. ఇక అపోలో హెల్త్ సిటీకి బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ అవార్డు, సమగ్ర టూరిజం అభివృద్ధిలో తెలంగాణకు మూడో బహుమతి లభించడం విశేషం. ఇప్పుడు ఇలా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు అవార్డుల పంట పండటం హర్షం వ్యక్తం అవుతోంది. ఇలా అరుదైన అవార్డులు దక్కించుకోవడం గర్వంగా ఉందని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. ఇలా అవార్డులు రావడం మరింత బాధ్యత పెరుగుతుందని తెలిపాయి. రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. దేశంలో తెలుగు రాష్ట్రాలకు అవార్డులు దక్కడం చాలా సంతోషమని చెబుతున్నాయి. ఇలాంటి అవార్డులు దక్కించుకునేందుకు మున్ముందు మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి
Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..