Andhra Pradesh: “పశువులకూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. వాటికీ బీమా సదుపాయం”.. అధికారులకు సీఎం జగన్ సూచన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పథకానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబర్ లో పశువులకు ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. స్వచ్ఛమైన ఆర్గానిక్..

Andhra Pradesh: పశువులకూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. వాటికీ బీమా సదుపాయం.. అధికారులకు సీఎం జగన్ సూచన..
AP CM YS Jagan
Follow us

|

Updated on: Sep 28, 2022 | 6:38 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పథకానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబర్ లో పశువులకు ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. స్వచ్ఛమైన ఆర్గానిక్ పాల ఉత్పత్తిని ప్రోత్సహించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే గ్రామాల్లోని పశువులకూ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధిరాలకు సూచించారు. పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడు, ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలో పశువులకు వైద్య సేవలు, పశువులకు బీమా తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. స్వచ్ఛమైన పాల ఉత్పత్తి కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. పంటలు, పాడి లో రసాయనాలను ఎక్కువగా వాడుతున్నందున వాటి అవశేషాలు జంతువుల శరీరంలోకి చేరుతున్నాయని, అవి ఇచ్చే పాలను తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సీఎం చెప్పారు. అందుకే ప్రజల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆర్గానికి పాల ఉత్పత్తిని ప్రోత్సహించాలని సూచించారు. పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలని కోరారు. అమూల్‌ ద్వారా రైతులకు మంచి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

తక్కువ పెట్టుబడి, సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించే అంశంపై పరిశోధనలు చేయాలి. వాటి ఫలితాలను రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలి. అమూల్‌ ద్వారా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఆలోచన చేయాలి. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయాలి. పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి. ప్రమాదవశాత్తు, ఏదేని కారణాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు వస్తాయి. అలాంటి సమయాల్లో వారికి అండగా నిలబడాలి. సాయిల్‌ డాక్టర్‌ మాదిరిగా కేటిల్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా అమలు చేయాలి. ఏటా క్రమం తప్పకుండా పశువుల ఆరోగ్యాలను పరిశీలించాలి. వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు-నేడు కింద పనులు చేపట్టి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి

– వైఎస్. జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మండలాన్ని యూనిట్‌గా తీసుకుని వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని సీఎం జగన్ అధికారులు సూచించారు. రెండో దశ కింద అక్టోబరులో మరిన్ని పశు అంబులెన్స్‌లు ప్రారంభానికి సిద్ధం చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే గ్రామాల్లోని పశువులకూ వైద్య సేవలు అందాలని సీఎం చెప్పారు. సిబ్బందిని నియమించుకుని వచ్చే సమావేశంలో దీని కార్యాచరణను తనకు నివేదించాలని స్పష్టం చేశారు. రైతులకు ప్రత్యామ్నాయం ఆదాయాలు పశుపోషణ ద్వారా వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ చర్యలు చేపట్టడం ద్వారా వ్యవసాయంతో పాటు, పశు పోషణ ద్వారా అదనపు ఆదాయాలు లభిస్తాయని ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసరా, చేయూత పథకాల లబ్ధిదారులకు పశువుల పెంపకంపై అవగాహన కల్పించడమే కాకుండా వారికి ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు చెప్పారు. బ్యాంకర్లతో మాట్లాడి వారికి రుణాలు వచ్చేలా చూడాలన్నారు. జంతువుల్లో లంపీ వైరస్‌ వ్యాపిస్తుందన్న సమాచారం వస్తోందని, దీని నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం చూడండి..