TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల – తిరుపతి మధ్య ఎలక్ట్రికల్ బస్సులు.. సీఎం జగన్ చేతుల మీదుగా..

తిరుమల వెళ్లే ప్రయాణీకులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కొండపై కి బస్సు సర్వీసులు నడుస్తుండగా.. వాటితో పాటు ఎలక్ట్రికల్ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ప్రజా రవాణాను భక్తులకు చేరువకు..

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల - తిరుపతి మధ్య ఎలక్ట్రికల్ బస్సులు.. సీఎం జగన్ చేతుల మీదుగా..
Electricla Bus In Tirumala
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 27, 2022 | 8:31 PM

తిరుమల వెళ్లే ప్రయాణీకులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కొండపై కి బస్సు సర్వీసులు నడుస్తుండగా.. వాటితో పాటు ఎలక్ట్రికల్ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ప్రజా రవాణాను భక్తులకు చేరువకు చేసేందుకు ఈ నిర్ఱయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మిక భావ పరిరక్షణ కోసం ఈ – బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అందుకే తిరుమల – తిరుపతి కేంద్రంగా తొలిసారిగా వీటిని ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ వివరించింది. ఈ మేరకు 100 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కాగా.. ఇప్పటికే నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. మరో 9 ఈ – బస్సులను తిరుపతికి తీసుకురానుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్ తిరుమలకు వచ్చిన తర్వాత వీటిని ప్రారంభించనున్నారు. అలిపిరి బస్‌ డిపో కేంద్రంగా ఈ – బస్సులు సర్వీసులు అందించనున్నాయి. 12 ఏళ్ల పాటు నిర్వహించేలా ఈవే ట్రాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. తిరుమల – తిరుపతికి 50 బస్సులు, రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు 14 బస్సులు, తిరుపతి నుంచి మదనపల్లెకి 12, తిరుపతి నుంచి నెల్లూరుకు, కడపకు 12 సర్వీసుల చొప్పున నడిపించనున్నారు.

మరోవైపు.. కలియుగ ప్రత్యక్ష దైవం కోనేటిరాయుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయం ఇస్తారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అలిపిరిలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ సర్వీసులను ప్రారంభించనునున్నారు. రాత్రి 7.45 గంటలకు బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 8.55 గంటలకు మాడవీధుల్లో శ్రీవారి పెద్ద శేష వాహన సేవలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులను టీటీడీ అనుమతించలేదు. ఈసారి వాటిని తొలగించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఉత్సవాలను కళ్లారా చూస్తున్న సయమంలో భక్తులు.. స్వామి వారి విగ్రహం పైకి నాణేలు విసురుతుండటం సాధారణమే. అయితే భక్తులు విసిరే నాణేల కారణంగా ఉత్సవ మూర్తులు, స్వామి వారి ఆభరణాలకు నష్టం కలుగుతోంది. పూజారులు, వాహనాన్ని మోసే సిబ్బంది కూడా గాయాలబారిన పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి పనులు చేయవద్దని ఈసారి భక్తులకు TTD విజ్ఞప్తి చేసింది.

ఇవి కూడా చదవండి

వాహన సేవల్లో పాల్గనేందుకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని టీటీడీ కోరింది. తిరుమలలో ప్లాస్టిక్‌పై సంపూర్ణ నిషేధం విధించారు. కాబట్టి భక్తులు స్టీల్‌, రాగి వాటర్‌ బాటిళ్లు తెచ్చుకోవాలని సూచించింది. తిరుమలలో 12 వేల వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉంది. అదనంగా వచ్చే వాహనాలను అలిపిరి దగ్గరే పార్కింగ్ చేసేలా ఏర్పాటు చేశారు. భక్తులు ఈ మార్పులను గమనించి, సిబ్బందికి సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం చూడండి..